వయసుకి మించిన పాత్రలు.. అయినా అదరగొట్టారు

వయసుకి మించిన పాత్రలు.. అయినా అదరగొట్టారు
x
Highlights

అన్ని రకాల పాత్రలను పోషించినప్పుడే నటుడికి నటన అనేది పూర్తి స్థాయి సంతృప్తిని ఇస్తుంది. కానీ ఇందులో వయసుకు మించిన పాత్రలో కనిపించి మెప్పించడం అంటే...

అన్ని రకాల పాత్రలను పోషించినప్పుడే నటుడికి నటన అనేది పూర్తి స్థాయి సంతృప్తిని ఇస్తుంది. కానీ ఇందులో వయసుకు మించిన పాత్రలో కనిపించి మెప్పించడం అంటే అంతా ఈజీ కాదనే చెప్పాలి. అదో సాహసమే.. కానీ వయసుకు మించిన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇందులో ఎక్కువగా డబల్ రోల్స్ ఉండడం విశేషం..

కమల్ హసన్

కమల్ హసన్ ఎంత గొప్ప నటుడో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు..తన నటనతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయిన భారతీయుడు సినిమాలో డబల్ రోల్ లో కనిపించారు. ఇందులో ముసలి పాత్ర అయిన సేనాపతిగా కనిపించి మెప్పించాడు కమల్.. ఇదే కాకుండా కళాతపస్వి కే విశ్వనాద్ దర్శకత్వంలో వచ్చిన సాగర సంగమం సినిమాలో వయసు మళ్ళీన వృద్దుడి పాత్రలో కనిపించి మెప్పించాడు కమల్

చిరంజీవి :

సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి.. ఇప్పటివరకు 151 సినిమాలు చేసారు. ఇందులో వివిధమైన పాత్రలను పోషించారు మెగాస్టార్ .. ఇక అందులో స్నేహకోసం సినిమాలో చిరంజీవి డబల్ రోల్ లో కనిపించారు. అందులో సింహాద్రి అనే పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు. ఆ పాత్రకు అయన జీవం పోశారనే చెప్పాలి.

బాలకృష్ణ :

నందమూరి వంశం నుండి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఎక్కువగా వైవిధ్యమైన పాత్రల చేయడంలో ఆసక్తిని చూపించారు. అందులో భాగంగా పెద్దన్నయ్య, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన భైరవ ద్వీపం సినిమాలో వృద్దుడి పాత్రలో కనిపించి మెప్పించాడు బాలకృష్ణ.. అంతేకాకుండా తాజాగా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా వయసుకు మించిన పాత్రలో కనిపించి మెప్పించాడు .

నాగార్జున :

నాగార్జున వయసుకు మించిన పాత్రలు చేసింది కేవలం భక్తీరస చిత్రాల్లో అనే చెప్పాలి. ముఖ్యంగా అన్నమయ్య సినిమాలో అయన నటనకి గాను ఏకంగా స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నేషనల్ అవార్డు దక్కింది. ఈ సినిమా నాగ్ కెరియర్ లో మైలురాయిగా మిగిలిపోయింది. ఆ తర్వాత షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ సినిమాలో వయసుకి మించిన పాత్రల్లో కనిపించారు నాగ్ ..

వెంకటేష్ :

ముందునుండి ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలనే చేసుకుంటూ వచ్చాడు వెంకటేష్. అందులో భాగంగా భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వచ్చిన సూర్యవంశం సినిమాలో డబల్ రోల్ లో కనిపించారు వెంకటేష్.. ఇందులోని హరిశ్చంద్ర ప్రసాద్ పాత్రలో అయన జీవించారనే చెప్పాలి.

మోహన్ బాబు :

తన సినీ ప్రయాణంలో చాలా పోషించారు మోహన్ బాబు.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. పెదరాయుడు సినిమాలో పెదరాయుడు పాత్రలో నటించి మెప్పించాడు మోహన్ బాబు. ఇప్పటికి ఈ సినిమాకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండడం విశేషం. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు మోహన్ బాబు..

ఇలా చెప్పుకుంటే పోతే చాలా మంది నటులే ఉన్నారు. తమ వయసుకు మించిన పాత్రలో కనిపించి అభిమానుల చేత శభాష్ అనిపించుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories