టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 10/07/2024 )

Todays Top 6 News Headlines 10th July 2024
x

టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 10/07/2024 )

Highlights

టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 10/07/2024 )



తెలంగాణ డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరో వైపు రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.


హీరో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ప్రేమించి మోసం చేశారని లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. దీంతో 420, 506 , 493 సెక్షన్ల కింద కేసు పెట్టారు. మరో వైపు లావణ్యపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


ఆంధ్రప్రదేశ్ లో రూ. 70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ది కర్మాగారం , పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ఛైర్మెన్, ఎండీ కృష్ణకుమార్ నేతృత్వంలో ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు.


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన గేమ్ ఛేంజర్ గా రష్యా అభివర్ణించింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రష్యా సైన్యంలో ఉన్న భారతీయులను వెనక్కి రప్పించడంతో పాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి.


ఐఆర్ఎస్ అధికారి ఎం. అనసూయ పేరు మార్చుకున్నారు. అంతేకాదు ఇక నుండి స్త్రీకి బదులుగా ఆమెను పురుషుడిగా కేంద్ర ఆర్ధికమంత్రిత్వశాఖ గుర్తించింది. హైద్రాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న అనసూయ ఇక ఎం. అనుకతిర్ సూర్యగా మారారు.


ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారి పూజా ఖేద్కర్ ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రత్యేక వసతులు కల్పించాలని ఆమె కోరి వివాదాల్లో చిక్కుకున్నారు. తన ప్రైవేట్ ఆడికారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకున్నారు.ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పూజా ఖేద్కర్ ను వాషిమ్ జిల్లాకు బదిలీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories