ఈ రోజు హిందీ భాషా దినోత్సవం: హిందీ మన జాతీయ భాష

ఈ రోజు హిందీ భాషా దినోత్సవం: హిందీ మన జాతీయ భాష
x
Highlights

హిందీ ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో రెండో స్థానం హిందీ భాష దే. హిందీ మన జాతీయ భాష. అఖండ భారతాన్ని ఎకీకృతంగా ఉంచడంలో హిందీ భాష దే ప్రముఖ స్థానం.

మనం రోజు వాడె బాష మనని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన ఆలోచనలను, మన సంస్కృతిని. ఈ రోజు హిందీ భాషా దినోత్సవం. ఈ హిందీ బాష దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14 న జరుపుకుంటాము. భారత జాతీయోద్యమంలో సాధారణ ప్రజలందరిని ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. అందుకే గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ ఆ రోజుల్లో పొందుపరిచారు.

అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది కావడం. మన జాతీయ భాషగా పేరుగాంచిన "హిందీ" భాషకు "హిందీ దివస్" అని ఈ రోజు పిలుచుకుంటాం. మన అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించబడింది. హిందీ భాష చాలావరకూ సంస్కృతం నుంచి గ్రహించబడినది. అయితే కాలక్రమంలో ఉత్తర భారతదేశంలోని ముస్లిం ప్రభావం వల్ల పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష ఆవిర్భవించింది. ఈ రోజు వీలైనంత వరకు హిందీ లో మాట్లాడుదాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories