Tips for black hair: కురులు నల్లగా ఎప్పుడూ ఉండాలంటే ఇలా చేస్తే సరి!

Tips for black hair: కురులు నల్లగా ఎప్పుడూ ఉండాలంటే ఇలా చేస్తే సరి!
x
Highlights

Tips for black hair:: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం చాలా చిరాగ్గా ఉండే విషయం. దీని వల్ల మనం వయసు కంటే పెద్దగా క‌న‌డుతాం ... అదో పెద్ద స‌మ‌స్య ఫీల‌వుతుంటారు.

Tips foi black hair: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం చాలా చిరాగ్గా ఉండే విషయం. దీని వల్ల మనం వయసు కంటే పెద్దగా క‌న‌డుతాం ... అదో పెద్ద స‌మ‌స్య ఫీల‌వుతుంటారు. అది చూసిన వాళ్ళు కూడా 'అయ్యో, అప్పుడే తెల్ల జుట్టు వచ్చేసిందా' అని వేళాకోళం చేస్తుంటే ఇంకా విసుగ్గా అనిపిస్తుంది. జుట్టు తెల్లబడడం అన్నది జ‌న్యుప‌ర‌మైన స‌మ‌స్య‌. కొంత మందికి మాత్రం విటమిన్ బీ12, విటమిన్ డీ, కాపర్, ఐరన్ లోపం వల్ల కూడా ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఒత్తిడి వల్ల కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది. సన్ లైట్ కి ఎక్కువ గా ఎక్స్పోజ్ అవ్వడం కూడా మ‌రో కారణం. ఈ మ‌ధ్య‌కాలంలో హెయిర్ స్టైలింగ్ కోసం వాడే ప్రోడక్ట్స్ వ‌ల్ల కూడా ఈ సమస్య వ‌స్తుంది. దీంతో మాటిమాటికీ రంగు వేసుకోవ‌డం. దానితో చ‌ర్మ స‌మ‌స్య‌లు రావ‌డం కూడా ప‌రిపాటే .. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌డానికి.. కొన్ని చిట్కాలున్నాయి. ఈ చిట్కాలకి కావలసిన దినుసులన్నీ కూడా మీ వంటింట్లోనే ఉంటాయి. అవేమిటో చూసేద్దామా మరి.

బ్లాక్ టీ:

రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులను ఒక కప్పు నీటిలో వేసి రెండు నిమిషాలు మరిగించండి. ఈ మిశ్రమం చల్లారాక మీ జుట్టుకి పట్టించి ఒక గంట ఆరనివ్వండి. ఆ త‌రువాత‌ చన్నీటితో తలస్నానం చేయండి. షాంపూ చేయకండి. ఇలా రెండు వారాలకి ఒకసారి చేయాలి. బ్లాక్ టీ మీ హెయిర్ కి బ్లాక్ కలర్ ని ఇస్తుంది. అలాగే, డల్ హెయిర్ ని రివైవ్ చేస్తుంది.

కరివేపాకు:

మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేడి చేయండి. పాన్ అడుగున నల్లగా ఏర్పడేవరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత జుట్టుకు పట్టించండి. ఒక గంట తరువాత సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయండి. కరివేపాకు జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనిన్ని రిస్టోర్ చేసి, జుట్టు కూడా బాగా పెరిగేలా చేస్తుంది.

కొబ్బరి నూనె, నిమ్మకాయ:

ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసంలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించండి. ముప్ఫై నిమిషాల త‌రువాత‌ సల్ఫేట్-ఫ్రీ షాంపూ తో స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు ప్ర‌య‌త్నించండి. దీని వల్ల ఆల్రడీ తెల్లబడిన జుట్టు నల్లగా మారదు కానీ, కొత్త తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది.

బ్లాక్ కాఫీ:

బాగా స్ట్రాంగ్ గా కాచిన కాఫీ డికాషన్ చల్లారిన తరువాత ఒక మగ్ లోకి తీసుకోండి. ఈ కాఫీ ని జుట్టంతా తడిసేటట్లుగా పోయండి. ఇరవై నిమిషాలు ఆగిన తరువాత చల్లని నీటితో తలస్నానం చేయండి. షాంపూ చేయకండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కానీ రెగ్యులర్ యూజ్ వల్ల జుట్టు డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది.

మెంతులు:

ఒక పాన్ లో అరకప్పు కొబ్బరి నూనె వేసి మరిగించండి. అందులో పావు కప్పు మెంతులు వేసి ఇంకొక ఏడెనిమిది నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. మెంతులు తీసేసి ఆ ఆయిల్ ని ఒక జార్ లోకి తీసుకోండి. ఇప్పుడు కొంచెం నూనె తీసుకుని జుట్టుకి పట్టించండి. రాత్రంతా అలా వదిలేసి పొద్దున్న సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు.

మిరియాలు:

ఒక కప్పు పెరుగులో రెండు గ్రాముల నల్ల మిరియాలు వేసి బ్లెండ్ చేయండి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ళ నించీ చివరల వరకూ పట్టించండి. ఈ పని చేస్తున్నప్పుడు ఆ చేత్తో కళ్ళు నలుపుకోకండి, కళ్ళు మండుతాయి. ఒక గంట వదిలేసిన తరువాత సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేయవచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లబడడమే కాక జుట్టు సాఫ్ట్ గా అవుతుంది కూడా.

బంగాళా దుంప తొక్కలు:

ఓ క‌ప్పు బంగాళా దుంప‌ల తొక్కల్ని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించండి. ఆ నీరు గంజి లాగా అయ్యేవరకూ మరిగించండి. చల్లారిన తరువాత ఆ నీటిని వడగట్టి తొక్కలు తీసేసి లిక్విడ్ ని ఒక మగ్ లోకి తీసుకోండి. హెయిర్ వాష్ చేసి, కండిషన్ చేసిన తరువాత ఈ లిక్విడ్ ని తల మీద పోయండి. జాగ్రత్తగా జుట్టంతా తడిసేటట్లు పోయండి. ఇంకా తరువాత తల మీద నీరు పోయకండి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయవచ్చు. ఈ మిశ్రమం జుట్టుకి పిగ్మెంటేషన్ ని ఇస్తుంది. ఈ పని చేయడం కూడా చాలా సులువు.

కొబ్బరి నూనె, ఉసిరి పొడి:

మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి వేసి వేడి చేయండి. ఈ పొడి నల్లబడే వరకూ ఇలా చేయండి. ఇది చల్లారిన తరువాత ఈ నూనె తో జుట్టు కుదుళ్ళ నుండీ చివరల వరకూ మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేయండి. ఒక గంట అలా వదిలేయండి. లేదా రాత్రంతా కూడా అలాగే ఉంచేయవచ్చు. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయవచ్చు. ఉసిరికాయ లో ఉండే విటమిన్ సీ, యాంటీ-ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాలికిల్స్ దగ్గర ఉండే మెలనిన్ ని ప్రిజర్వ్ చేస్తుంది. దీని వల్ల గ్రేయింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories