AC: రాత్రంతా ఏసీ వేసుకొని పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..!

These are the Side Effects With Sleeping in AC Room Entire Night
x

AC: రాత్రంతా ఏసీ వేసుకొని పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..!

Highlights

AC: ప్రస్తుతం ఏసీ వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు కేవలం కొందరి ఇళ్లకు మాత్రమే పరిమితమైన ఏసీ వినియోగం ప్రస్తుతం బాగా పెరిగింది.

AC: ప్రస్తుతం ఏసీ వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు కేవలం కొందరి ఇళ్లకు మాత్రమే పరిమితమైన ఏసీ వినియోగం ప్రస్తుతం బాగా పెరిగింది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఏసీలను వినియోగిస్తున్నారు. చల్లటి గాలిలో హాయిగా నిద్రిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఏసీ వినియోగం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రంతా ఏసీ ఆన్‌లోనే ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇంతకీ ఆ సమ్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఏసీ గదిలో తేమ స్థాయిని తగ్గిస్తుంది. ఈ కారణంగా గదిలోని గాలి పొడిగా మారుతుంది. ఈ పొడి గాలి శ్వాసకోశ వ్యవస్థపై తీత్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉబ్బసం, అలెర్జీలు వంటి సమస్యలతో బాధపడేవారికి చాలా డేంజర్‌ అని చెబుతున్నారు. ఏసీలో నిద్రించడం వల్ల ముక్కు, గొంతు వాపు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఏర్పడుతాయి.

* ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి చర్మం తేమను తగ్గిస్తుంది. దీంతో స్కిన్‌ డ్రైగా మారుతుంది. ఇది చర్మ దురద, వాపు వంటి సమస్యలకు కారణమవుతుంది. అధికంగా ఏసీ వినియోగం వల్ల చర్మం సహజసిద్ధమైన మెరుపును కోల్పోయి అనేక చర్మ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

* ఏసీ చల్లదనం కండరాలు, కీళ్లలో దృఢత్వాన్ని కలిగిస్తుంది. ఆర్థరైటిస్ లేదా ఇతర కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చల్లటి గాలికి నేరుగా గురికావడం కండరాల ఒత్తిడి పెరిగి నొప్పికి నొప్పికి కారణమవుతుంది.

* నిరంతరం ఏసీలో ఉండే వారిలో రోగ నిరోధక శక్తి కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం ఏసీలో ఉన్న వారికి జలుబు, దగ్గు వంటి సమస్యలు చిటికిమాటికి వస్తుంటాయి. అలాగే ఏసీ ఫిల్టర్‌లో పేరుకుపోయే బ్యాక్టీరియా, దుమ్ము కూడా వ్యాధులకు కారణమవుతుంది.

* రాత్రంతా ఏసీలో గడపడం వల్ల కంటి సమస్యలు కూడా తప్పవు. గదిలో తేమ తగ్గడం వల్ల కళ్లలో తేమ తగ్గుతుంది. ఇది కళ్ళు పొడిగా మారడానికి, దురదకు దారి తీస్తుంది. ముఖ్యంగా కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగించే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories