20 రూపాయల చోరీ.. 41 ఏళ్ల విచారణ..

20 రూపాయల చోరీ.. 41 ఏళ్ల విచారణ..
x
Highlights

కొన్ని వినడానికి వింతగా ఉంటాయి. కొన్నిటిని నమ్మలేం కూడా. ఇది కూడా అలాంటిదే. సాధారణంగా పెద్ద పెద్ద కేసులే సంవత్సరాలకు సంవత్సరాలు నడుస్తాయని అనుకుంటాం....

కొన్ని వినడానికి వింతగా ఉంటాయి. కొన్నిటిని నమ్మలేం కూడా. ఇది కూడా అలాంటిదే. సాధారణంగా పెద్ద పెద్ద కేసులే సంవత్సరాలకు సంవత్సరాలు నడుస్తాయని అనుకుంటాం. కానీ, అప్పట్లో 20 రూపాయలు చోరీ కేసు 41 ఏళ్ల విచారణ తరువాత తుది తీర్పు పొందింది. ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్న ఈ ఘటన గ్వాలియర్ లో చోటుచేసుకుంది.

బాబులాల్‌ (61) అనే వ్యక్తి 41 ఏళ్ల కిందట అంటే 1978లో బస్సులో టిక్కెటు కోసం నిల్చుని ఉండగా ఇస్మయిల్‌ ఖాన్‌(68) అనే వ్యక్తి తన జేబులోంచి రూ.20 దొంగిలించాడని కేసు పెట్టాడు. అప్పట్లో ఆ కేసును పరిశీలించిన పోలీసులు ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేసు విచారణ లో ఉండగా కొన్ని నెలల అనంతరం అతను బెయిల్ మీద విడుదల అయ్యాడు. విడుదల అయిన తరువాత కూడా కేసు విచారణ కోసం కోర్టుకు హాజరవుతూ వచ్చాడు. అయితే, 2004 సంవత్సరం నుంచి అతను విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో కోర్టు సదరు ఖాన్ ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత మూడు నెలలుగా అతను జైలు లోనే ఉన్నాడు. ఇప్పుడు ఖాన్ కుటుంబం పేదరికంతో ఉండడంతో అతనికి బెయిల్ ఇప్పించేందుకు ఎవరూ రాలేదు. దీంతో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లోక్‌అదాలత్‌లో విచారణ చేపట్టారు. ఫిర్యాదీని కూడా పిలిపించి ఇద్దరికీ రాజీ చేశారు. ఇటువంటి నేరాలు మళ్ళీ చేయనని నిందితుడి దగ్గర రాతపూర్వక హామీ తీసుకుని ఖాన్ ను విడుదల చేశారు. అలా ఓ 20 రూపాయల దొంగతనం 41 సంవత్సరాలు ఓ వ్యక్తిని ఆడుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories