కొత్త సంవత్సరంలో 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునే దివ్యభాగ్యం.. ఎలాగంటే..?

The IRCTC Tour Package is a Special Opportunity to Visit 7 Jyotirlingas in the New Year | Telugu Online News
x

కొత్త సంవత్సరంలో 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునే దివ్యభాగ్యం.. ఎలాగంటే..?

Highlights

IRCTC Tour Package: దేశంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కవర్ చేసే టూర్ ప్యాకేజీలలో ఒకటి...

IRCTC Tour Package: నూతన సంవత్సర సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తుంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గొప్ప టూర్ ప్యాకేజీని అందిస్తోంది. దీని ద్వారా మీరు దేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కూడా దర్శించవచ్చు. భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ రైలు దేశంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను కవర్ చేసే టూర్ ప్యాకేజీలలో ఒకటి. IRCTC వెబ్‌సైట్ www.irctctourism.comని సందర్శించడం ద్వారా ప్రయాణికులు ఈ టూర్ ప్యాకేజీ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు.

ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

07 జ్యోతిర్లింగాలతో కూడిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రయాణం 04.01.2022 నుంచి ప్రారంభమవుతుంది అంటే పూర్తి టూర్ ప్యాకేజీ 12 రాత్రులు, 13 పగళ్లు ఉంటుంది. భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ రైలు 04.01.2022న గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు గోరఖ్‌పూర్, డియోరియాసదర్, బెల్తరా రోడ్, మౌ, వారణాసి, భదోహి, ఝంఘై, ప్రయాగ్‌రాజ్ సంగం, ప్రతాప్‌గఢ్, గౌరీగంజ్, రాయ్ బరేలీ, లక్నో, కాన్పూర్, ఝాన్సీ నుంచి ఎక్కవచ్చు.

ఏ గమ్యస్థానాలు కవర్ చేస్తారు..

ఈ పర్యటనలో ఉజ్జయిని, వడోదర, సోమనాథ్, ద్వారక, పూణే, పర్లి వైజనాథ్, ఔరంగాబాద్, నాసిక్ రోడ్ కవర్ చేస్తారు. అదే సమయంలో ఈ మొత్తం టూర్ ప్యాకేజీ కోసం ప్రయాణీకులు రూ. 12,285/- ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలో GST కూడా చేర్చారు. ఆలయ దర్శనం, స్మారక చిహ్నాల సందర్శన కోసం COVID-19 టీకా సర్టిఫికేట్ తప్పనిసరి. దీంతో పాటు పర్యటన సమయంలో ప్రయాణీకులందరూ టీకా ధృవీకరణ పత్రాన్ని హార్డ్ కాపీలో లేదా ఫోన్‌లో తీసుకెళ్లడం కూడా అవసరం. అలాగే, హాల్ట్ స్టేషన్‌లలో బయలుదేరే సమయాలు తాత్కాలికంగా ఉంటాయి. రైల్వేల ఆమోదం, షెడ్యూల్ ప్రకారం రైలు నడుపుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories