అతి పెద్ద సొరచేప.. దీని పొడవు ఎంతో తెలుసా?

అతి పెద్ద సొరచేప.. దీని పొడవు ఎంతో తెలుసా?
x

17-foot white shark 'queen of the ocean' (Image from OCEARCH Instagram)

Highlights

నీలి సముద్రం.. ఒడ్డున నిలబడి చూస్తే అందమైన అనుభూతి. అదే సముద్ర గర్భంలో తొంగి చూస్తే అనంతమైన విశేషాల సంపుటి.

నీలి సముద్రం.. ఒడ్డున నిలబడి చూస్తే అందమైన అనుభూతి. అదే సముద్ర గర్భంలో తొంగి చూస్తే అనంతమైన విశేషాల సంపుటి. ఇక సముద్రంలో జీవించే జీవుల గురించి తెలుసుకునే కొలదీ ఎన్నో విషయాలు ఆశ్చర్యానికి లోను చేస్తాయి. చాలా మంది పరిశోధకులు అనంతమైన సముద్రంలో.. లెక్కలేనన్ని జీవరాశుల విషయాల్ని తెలుసుకుని వాటిని ప్రపంచంతొ పంచుకుంటారు. ఒక్కోసారి ఒక్కో విషయం తెలుసుకున్న కొద్దీ బోలెడంత ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటిదే ఇది.

సముద్రంలో ఉండే షార్క్ ల గురించి అందరికీ తెలిసిందే.. ఇటీవల వైట్ షార్క్ లలో అతి పొడవైన షార్క్ ను పట్టుకున్నారు పరిశోధకులు. కెనడాకు చెందిన 17 అడుగులకు పైగా పొడవున్న వైట్ షార్క్ ను చూశారు. దాని పొడవును లేక్కించడమే కాకుండా దానికి 'క్వీన్ ఆఫ్ ది ఓషన్' అని బిరుదు కూడా ఇచ్చేశారు. నోవా స్కాటియా కు చెందిన ఒక ఎన్జీవో ఈ షార్క్ ను గత శుక్రవారం కనుగొంది. ఈ షార్క్ 17 అడుగుల రెండు అంగుళాల పొడవుతో అతి పొడవైన షార్క్ గా ఆ సంస్థ పేర్కొంది.

ఈ షార్క్ విశేషాలను ఓసెర్చ్ యాత్ర నాయకుడు క్రిస్ ఫిషర్ చెబుతూ '' ఇది వయసులో చాలా పెద్ద షార్క్. ఈ షార్క్ శరీరం పై ఎన్నో మానిన గాయాల మచ్చలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో రంగుల మచ్చలు కూడా ఉన్నాయి. ఇది ఆ జీవి ఒక్క ఎన్నో సంవత్సరాల జీవితాన్ని మనకు చెబుతాయి'' అన్నారు. ఈ షార్క్ కు ఆ బృందం "నుకుమి" (నూ-గూ-మీ అని ఉచ్ఛరిస్తారు) అని పేరుపెట్టారు. ఇది 1,600 కిలోగ్రాముల కంటే కొంచెం ఎక్కువ బరువు వుంది.

21 పరిశోధన ప్రాజెక్టులకు ఈ తెల్ల సొరచేప దోహదపడుతుంది. ఈ చేప నుంచి పరిశోధకులు నమూనాలను సేకరించారు. దీని దంతాల నుంచి బ్యాక్టీరియా నమూనాలతో పాటు రక్తం, కండరాలు, మలం, చర్మ నమూనాలను తీసుకున్నారు. ఈ భారీ సోరచేపను ట్యాగ్ చేసి తిరిగి సముద్రంలో వదిలి పెట్టారు. ఈ టాగ్ ద్వారా ఈ చేప యొక్క కదలికలను ఐదేళ్ల పాటు ట్రాక్ చేయడానికి వీలవుతుంది. అంతే కాకుండా సముద్ర గర్భంలో ఎంత లోతు వరకూ ఈ సొరచేప వెళుతుంది అనేది స్పష్టంగా రికార్డు అవుతుంది.Show Full Article
Print Article
Next Story
More Stories