మన సన్నీపుట్టినరోజు ఈ రోజు – బౌలర్స్ ని గడగడలాడించిన గావాస్కర్!

మన సన్నీపుట్టినరోజు ఈ రోజు – బౌలర్స్ ని గడగడలాడించిన గావాస్కర్!
x
Highlights

అప్పటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్గా ఎన్నో విజయాలు అందించిన మేటి ఆటగాడి పుట్టినరోజు ఈ రోజు..... టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్...

అప్పటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్గా ఎన్నో విజయాలు అందించిన మేటి ఆటగాడి పుట్టినరోజు ఈ రోజు..... టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ ఇతడు... 1983 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో ఒక ఆటగాడు ఇతడు....అతనే...మన సునీల్ మనోహర్ గావాస్కర్. నేడు గావాస్కర్ పుట్టినరోజు. 1949 జూలై 10న జన్మించిన సునీల్ మనోహర్ గావాస్కర్ భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.

సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ 1970', 1980' దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకుఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలందించాడు. తన హయంలో 34 టెస్టు సెంచరీలతో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు .

డిసెంబరు 2005లో మనదేశానికే చెందిన సచిన్ టెండుల్కర్ ఈ రికార్డును అధికమించాడు. 125 టెస్టు మ్యాచ్ లు ఆడి మొత్తం 10122 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన అలాన్ బోర్డర్ ఈ రికార్డును అధికమించిననూ టెస్ట్ క్రికెట్ లో 10 వేల పరుగులను సాధించిన తొలి క్రికెటర్ గా ఇతని రికార్డు మాత్రం ఎవరూ చెరపలేనిది. తొలిసారిగా వెస్ట్‌ఇండీస్ పర్యటనలో ఒకే సీరీస్ లో 774 పరుగులు చేసినప్పటి నుంచి చివరగా పాకిస్తాన్తో బెంగుళూరు టెస్టులో 96 పరుగులు చేసే వరకు అతని క్రీడాజీవితంలో ఎన్నో మైళ్ళురాళ్ళు.

బ్యాట్స్‌మెన్లను గడగడలాడించే అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొని సుదీర్ఘ టెస్టు క్రికెట్ జీవితంలో 51.12 సగటుతో 34 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు సాధించడం సామాన్యం కాదు. ఆ సమయంలో తిరుగులేని జట్టుగా నిల్చిన వెస్ట్‌ఇండీస్ పైనే సెంచరీలపై సెంచరీలు సాధించి 65.45 సగటు పరుగులు సాధించడం అతని పోరాట పటిమను తెలియజేస్తుంది.

మైకేల్ హోల్డింగ్, ఆంబ్రోస్, ఆండీ రాబర్ట్స్, జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీ, ఇమ్రాన్ ఖాన్ ల బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని భారత జట్టుకు అపురూప విజయాలు సాధించిన గావాస్కర్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లభించడం భారత జట్టుకు వరం లాంటిది. గావాస్కర్‌కు, కపిల్‌దేవ్‌కు మధ్య నాయకత్వ పోటీ ఏర్పడే సమయంలో టెస్టు జట్టు నుంచి నిష్క్రమించాడు. 1984లో ఆసియా కప్ గెల్చిన భారత జట్టుకు ఇతడు నాయకత్వం వహించాడు. ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతున్న సందర్భంలో సన్నీ పుట్టినరోజు వేడుకలు అక్కడే చేసుకోవడం మరో విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories