Static Current: మీరు ఎవరినైనా తాకితే కరెంట్ షాక్ తగులుతోందా? అసలు కారణం ఇదే..

Static Current Shock What Causes That Electric Shock Feeling When You Touch Someone
x

Static Current: మీరు ఎవరినైనా తాకితే కరెంట్ షాక్ తగులుతోందా? అసలు కారణం ఇదే..

Highlights

Static Current Feeling: ఎవరైనా తాకినప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్లు అవుతుందా? అయితే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి వివరాలు తెలుసుకుందాం.

Static Current Feeling: ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ వేదికగా స్టాటిక్‌ కరెంట్‌ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఎవరినైనా తాకగానే కరెంట్ షాక్ కొట్టిన అనుభూతి కలగడం. ఏవైనా వస్తువులు తాగినా కానీ కరెంట్ షాక్ అనుభూతిని వస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట బాగా షేర్ చేసి వైరల్ అవుతున్నారు. అయితే చాలామంది ఈ ఫీలింగ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తమ పక్కనే ఉన్న ఇతర వ్యక్తులను తాకిన వెంటనే కరెంట్ షాక్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అయితే ఇది దీనికి అసలు కారణం ఏమైందో అని ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఇలా కరెంట్ షాక్ రావడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే అంటున్నారు నిపుణులు. కరెంట్ షాక్ తగిలిన అనుభూతి కలుగుతుందని చాలా మంది చెబుతున్నారు . ప్రధానంగా మనం శరీరంలో ఎలక్ట్రానిక్ సంఖ్య పెరిగినప్పుడు ప్రతికూలంగా ఛార్జ్ పెరుగుతుంది. దీన్ని స్టాటిక్‌ కరెంట్‌ అంటారు. ఇలాంటి సమయంలో ఎవరైనా మనల్ని తాకినప్పుడు కరెంట్ షాక్ తగిలిన అనుభూతి కలుగుతుంది.

ఇక భూమి వాతావరణంలో అయాన్లు కనిపిస్తాయి. ఇవి సౌర్య వికిరణాలు నుంచి పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోయిన తర్వాత ఏర్పడతాయి. మానవ శరీరంలో ఆయాన్ చానల్స్ ద్వారా ప్రసారం చేస్తుంది. శరీర ప్రక్రియలను ఇవి నిర్వహిస్తాయి దీనివల్ల కొన్ని వస్తువులను తాకినప్పుడు షాక్‌లా అనిపిస్తుంది.

ప్రధానంగా చలికాలం సమయంలో చర్మం పొడిగా మారుతుంది. ఎలక్ట్రాన్లు సులభంగా పేరుకు పోతాయి. దీంతో కొన్ని వస్తువులను తాకినప్పుడు కరెంట్ షాక్ అనిపిస్తుంది. జుట్టును తాకిన అలాగే అనుభూతి చెందుతారు. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి హాని ఉండదు, కానీ దీనిపై అనేక అపోహలు చాలామందిలో వస్తున్నాయి. అవన్నీ పుకార్లే అని నిపుణులు చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories