Sri Malika Book: శ్రీమాలికకు విశేష ఆదరణ.. ప్రముఖులకు గ్రంథాన్ని బహూకరించిన బొల్లినేని కృష్ణయ్య

Sri Malika Book: శ్రీమాలికకు విశేష ఆదరణ.. ప్రముఖులకు గ్రంథాన్ని బహూకరించిన బొల్లినేని కృష్ణయ్య
x
Highlights

పురాణపండ శ్రీమాలికను బొల్లినేని నుంచి అందుకున్న శైలజాకిరణ్

అద్భుతమైన మంత్రశక్తులు, మంత్ర రహస్యాలు, మంత్ర విశేషాలతో పాటు ముఖ్యంగా మహాబలాలకు మహాబలాన్ని అందించే పరమాద్భుత నృసింహ ఆవిర్భావ ఘట్టంతో పాఠకులను శక్తిమంతులను చేసే గొప్ప రచనా సంకలనంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన నాలుగు వందల పేజీల శ్రీమాలిక గ్రంథం తెలుగు రాష్ట్రాల్లో అప్రతిహతంగా దూసుకెళ్తోంది.

ఈ గ్రంథం విశేష ప్రాచుర్యం పొందడంలో కీలక పాత్ర పోషిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సౌజన్య హృదయాన్ని, అలాగే పురాణపండ శ్రీనివాస్ అసాధారణమైన నిర్విరామ కృషిని పీఠాధిపతులు, మఠాధిపతులు, సాహితీవేత్తలు, ఘనాపాఠీలు, భక్త పాఠకులు వేనోళ్ల ప్రశంసలతో కొనియాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల అపార గౌరవంతో, తొలిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో అపూర్వ సేవలు అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషిని గుర్తిస్తూ – ఈ ఇద్దరు ప్రముఖుల ఫోటోలను శ్రీమాలిక గ్రంథం వెనుక భాగంలో ముద్రించి, అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, ఉన్నతాధికారులకు బొల్లినేని కృష్ణయ్య వేలాది ప్రతులను పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది.

అదేవిధంగా, నారా చంద్రబాబు నాయుడు – భువనేశ్వరి దంపతుల చిత్రాలతో ప్రచురించిన శ్రీమాలిక గ్రంథ ప్రతులను తిరుపతి, కుప్పం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఉచితంగా అందజేయడం ద్వారా పార్టీ చరిత్రలో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని వేలాది కార్యకర్తల పూజా పీఠాలకు చేర్చిన ఘనత బొల్లినేని కృష్ణయ్యదేనని పార్టీ అగ్రనేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

జూబిలీ హిల్స్ రామాలయంలో జరిగిన ఒక అపురూపమైన పవిత్ర కార్యక్రమంలో మార్గదర్శి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీమతి శైలజాకిరణ్ తదితరులకు బొల్లినేని కృష్ణయ్య అపురూప జ్ఞాపికగా పురాణపండ శ్రీనివాస్ రచించిన పవిత్ర శ్రీమాలిక గ్రంథాన్ని ఆనందంగా బహూకరించడం అక్కడివారి దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

ఇటీవల హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో కూడా శ్రీమాలిక గ్రంథం మేధావి వర్గాన్ని ప్రత్యేకంగా ఆకట్టుకుని అగ్రస్థానంలో నిలిచిందని మీడియా సైతం ప్రశంసించింది. అదే సమయంలో రామాలయ వేదపాఠశాలల వేదపండితులు, ఆచార్యులు, విద్యార్థి వర్గాలకు కూడా ఈ దివ్య గ్రంథాలను బొల్లినేని కృష్ణయ్య అందజేయడం విశేషం.

ఋషుల పరంపరను చెక్కుచెదరకుండా కొనసాగిస్తూ ఆర్షగ్రంథాల రచనా, సంకలనాల ద్వారా అమోఘ గ్రంథాలను అందిస్తున్న పురాణపండ శ్రీనివాస్ – తన జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, ఎల్లవేళలా దైవీయ స్పృహతో సాగుతూ, తానే ఒక మంత్రాక్షరంగా దైవబలంతో వెలుగొందుతున్నారని అభిమానులు విశ్లేషిస్తున్నారు.

బొల్లినేని కృష్ణయ్య నిర్మాణాత్మక రాజకీయ, వైద్య సేవలు ఒక ఎత్తయితే – శ్రీమాలిక ద్వారా అందిస్తున్న ఈ నిస్వార్థ ఆధ్యాత్మిక సేవ చరిత్రలో నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని ముఖ్య సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి పర్యవేక్షణలో కూడా శ్రీమాలిక గ్రంథాలను పంపిణీ చేసినట్లు ఆయా ప్రాంతాల పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కార్యాలయంలో పత్రికలు ఉంచే ప్రదేశంలోనే నాలుగు–ఐదు శ్రీమాలిక గ్రంథాలు దర్శనమిస్తుండటం విశేషం. అనేక మంది మంత్రులు, రాజకీయ ప్రముఖులు నిత్యం వాటిని పరిశీలిస్తున్నారని సమాచారం.

ఇక హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గతంలో తన నియోజకవర్గంలోని కొన్ని ముఖ్య కార్యాలయాలకు శ్రీమాలిక గ్రంథాలను అందజేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories