Snake Viral Video: తలపై నాగమణి తో ఊర్లోకి వచ్చిన నాగుపాము.. దగ్గరగా చూసేసరికి నిజం తెలిసి బిత్తరపోయిన ప్రజలు..!

Snake Viral Video: తలపై నాగమణి తో ఊర్లోకి వచ్చిన నాగుపాము.. దగ్గరగా చూసేసరికి నిజం తెలిసి బిత్తరపోయిన ప్రజలు..!
x

Snake Viral Video: తలపై నాగమణి తో ఊర్లోకి వచ్చిన నాగుపాము.. దగ్గరగా చూసేసరికి నిజం తెలిసి బిత్తరపోయిన ప్రజలు..!

Highlights

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. మనుషులు చేసే వింత చేష్టలు, జుగాఢ్ వీడియోలు మాత్రమే కాకుండా జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. మనుషులు చేసే వింత చేష్టలు, జుగాఢ్ వీడియోలు మాత్రమే కాకుండా జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పాముల వీడియోలు వస్తే మరింత ఆసక్తిగా చూస్తారు. తాజాగా అలాంటి ఒక నాగుపాము వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఓ ఊరిలో ఒక నాగుపాము సంచారం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఆ పాము తలపై ఏదో వింతగా మెరుస్తూ ఉండడంతో అందరూ అది నాగమణి అని అనుకున్నారు. కొందరు యువకులు దగ్గరకు వెళ్లి ఫోటోలు, వీడియోలు తీశారు. కానీ దగ్గరగా చూసిన తర్వాత అసలు విషయం తెలిసి అందరూ బిత్తరపోయారు.

నిజానికి ఆ పాము తలపై నాగమణి ఏమీలేదు. ఒక ప్లాస్టిక్ బాటిల్ మూతలో దాని తల ఇరుక్కుపోయింది. దాంతో బయటపడలేక నానా తంటాలు పడుతూ చుట్టూ తిరుగుతోంది. దారి కనబడక అల్లాడుతూ జనం మధ్యలో సంచరించసాగింది. దాన్ని చూసినవారు పొరపాటున నాగమణి ఉందని భావించారు. కానీ వాస్తవానికి అది మనుషులు నిర్లక్ష్యంగా పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పాముకు తలెత్తిన ఇబ్బంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు పాముపై జాలిపడ్డారు. "అయ్యో పాపం" అంటూ కామెంట్లు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే మనం వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పర్యావరణంపై బాధ్యత వహించాలని పలువురు సూచించారు.

ఈ సంఘటన మరోసారి మనుషుల నిర్లక్ష్యం అమాయక జీవాలకు ఎంతటి ప్రమాదాన్ని తెస్తుందో గుర్తు చేస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories