Viral Video: ఇంట్లో నిద్రిస్తున్న యువతి పక్కనే నాగుపాము.. ఏమైందంటే?

Viral Video: ఇంట్లో నిద్రిస్తున్న యువతి పక్కనే నాగుపాము.. ఏమైందంటే?
x

Viral Video: ఇంట్లో నిద్రిస్తున్న యువతి పక్కనే నాగుపాము.. ఏమైందంటే?

Highlights

Viral Video: నెలపై నిద్రిస్తున్న యువతి దగ్గరకు వచ్చి బుసలు కొట్టిన నాగుపాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Snake Viral Video: ఇంట్లో నెలపై నిద్రిస్తున్న యువతిని నాగుపాము గమనిస్తూ బుసలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అడవులు, దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతంలో ఓ యువతి ఇంటి లోపల నెలపై పడుకుని నిద్రిస్తోంది. ఆ సమయంలో అక్కడికి నాగుపాము ప్రవేశించింది. యువతి దగ్గరకు చేరుకున్న పాము కొంతసేపు బుసలు కొడుతూ ఆమెను గమనిస్తూ నిలిచింది. యువతి మాత్రం గాఢ నిద్రలో ఉండటంతో పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియోగా చిత్రీకరించాడు. కొంతసేపటి తర్వాత చప్పుడు చేయడంతో నాగుపాము అక్కడి నుంచి చెట్లవైపు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ యువతి ప్రమాదం నుంచి బయటపడింది.

అయితే, ఈ వీడియో వెలుగులోకి రావడంతో నెలపై నిద్రించడం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టమైందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అడవులు, పొదలు ఉన్న ప్రాంతాల్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుందని, ఇంటి చుట్టూ చెత్త, దట్టమైన మొక్కలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుండగా, పలువురు నెటిజన్లు ఇలాంటి నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories