Snake Venom: వామ్మో.. పాముల విషానికి అంత రేటా..!

Snake Venom is in High Demand in the International Market
x
పాము విషం (ఫైల్ ఇమేజ్)
Highlights

Snake Venom: పాములు క‌నిపిస్తే చాలు ఒక్కొక్క‌రు భ‌య‌ప‌డి ప‌రుగెత్తుతారు. ఆ ప్ర‌దేశం ద‌రి దాపుల్లో కూడా క‌నిపించ‌రు.

Snake Venom: పాములు క‌నిపిస్తే చాలు ఒక్కొక్క‌రు భ‌య‌ప‌డి ప‌రుగెత్తుతారు. ఆ ప్ర‌దేశం ద‌రి దాపుల్లో కూడా క‌నిపించ‌రు. కానీ కొంత‌మంది ఉంటారు. వారికి ఎటువంటి భ‌యం ఉండ‌దు. అంతేకాదు ఏకంగా వారు వాటిని ప‌ట్టుకొని ఆటాడిస్తుంటారు. అది వారికి తెలిసిన విద్య‌. కానీ అంద‌రూ అలా చేయ‌లేరు. కొత్త‌గా తెలిసిన విష‌యం ఏంటంటే పాములు విషం తీసి కొంత‌మంది అమ్ముకుంటున్నార‌ని తెలుస్తోంది. పాముల విషం ఏంటి, అమ్ముకోవ‌డం ఏంటి విషం కూడా ఎక్క‌డైనా పని చేస్తుందా అని మీకు అనుమానం రావొచ్చు. ఆ సంతేంటో ఒక్క‌సారి ప‌రిశీలిద్దాం.

పాముల‌ను ప‌ట్టుకొని బ‌తికే కొంత‌మంది వాటి విషాన్ని తీసి అమ్ముకుంటున్నార‌ని తెలిసింది. ఎందుకంటే పాము విషానికి అంత‌ర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంద‌ని తేలింది. పాము విషాన్ని బంగారంలా తులాల చొప్పున అమ్ముతార‌ట‌ పాముల్లోకెల్లా నాగు పాము విషానికి చాలా డిమాండ్ ఉంటుంద‌ని తేలింది. కేవలం తులం పాము విషానికి నాలుగు వేల రూపాయల వరకు ధర పలుకుతుంది.. దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవచ్చు పాము విషానికి ఎంత డిమాండ్ ఉందో అని. సంచార జాతుల వారు ఇలా పాముల విషాన్ని పట్టి విక్రయిస్తూ చాలా మొత్తంలో డబ్బులు సంపాదిస్తారట.

ఇక దళారులు పాము విషాన్ని తులానికి 40 వేల చొప్పున విక్రయిస్తారని సమాచారం. ఈ లెక్కన లీటరు నాగుపాము విషం కావాలంటే దాదాపు 40 లక్షలు చెల్లించాల్సిందే. ఈ లెక్క‌న అన్ని వ్యాపారాల కంటే ఈ బిజినెస్ చాలా లాభాల‌తో కూడుకున్న‌ద‌ని చాలామంది ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా స్నేక్ క్యాచ‌ర్స్ దీనిపై ఎక్కువ‌గా దృష్టి సారించారు. కానీ ఇది చ‌ట్ట‌విరుద్ద‌మైన ప‌ని. దీనివ‌ల్ల పాముల మ‌నుగ‌డ‌కు ముప్పు వాటిల్లుతుంది. ఇప్ప‌టికీ అక్క‌డ‌క్క‌డ స్నేక్ క్యాచ‌ర్స్ ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories