వయస్సు ఆరేళ్ళు.. సంపాదన నెలకు 21 లక్షలు!

వయస్సు  ఆరేళ్ళు.. సంపాదన నెలకు 21 లక్షలు!
x
korean youtube star boram earns 21 lakhs per month with her channel. She recently brought a house for 55 crores
Highlights

ఆరేళ్ళ వయసులో పిల్లలు ఏం చేస్తారు? స్కూల్ కి వెళతారు. ఆడుకుంటారు. టీవీలో కార్టూన్ చానల్స్ చూసి గెంతులెత్తారు. ఇవే కదా మనకి తట్టే సమాధానాలు. కానీ, ఓ...

ఆరేళ్ళ వయసులో పిల్లలు ఏం చేస్తారు? స్కూల్ కి వెళతారు. ఆడుకుంటారు. టీవీలో కార్టూన్ చానల్స్ చూసి గెంతులెత్తారు. ఇవే కదా మనకి తట్టే సమాధానాలు. కానీ, ఓ ఆరేళ్ళ పాప నెలకు 21 లక్షలు సంపాదిస్తోందంటే మీరు నమ్మగలరా? నమ్మాల్సిందే. అందుకే ఈ విశేషం మీకోసం.

దక్షిణ కొరియాలో ఓ ఆరేళ్ళ చిన్నారి. పేరు బోరం (ఇది అభిమానులు పెట్టిన ముద్దు పేరు). ఆటబొమ్మలా పై పరిశోధనలు చేస్తోందిట. అంటే మార్కెట్ లో విడుదలవుతున్న రకరకాల ఆట వస్తువులపై రివ్యూ చేసి దానిని యుట్యూబ్ లో తన బోరం టాయ్ రివ్యూస్ అనే ఛానెల్ లో ఉంచుతోంది. ఈ చిన్నారి ఛానెల్ కు ఎంతమంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారో తెలుసా అక్షరాలా 30 లక్షల మంది.

ఈ బుడత తనకు వచ్చిన ఆదాయం తో పోయిన నెలలో 2 , 770 చదరపు అడుగుల ఇల్లు కొనుకుంది. దాని విలువ మన కరెన్సీలో 55 కోట్లు. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ చిన్నారి ఎంత సంపాదిస్తుందో. నెలకి ఆమె యుట్యూబ్ ఛానెల్ ద్వారా దాదాపు 21 లక్షల రూపాయలు ఆదాయం వస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories