ఈమె ఆమేనా..! ఇంత మారిపోయిందా..? షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఆ నటి ఆమేనా..?

Shopping Mall movie actress
x

ఈమె ఆమేనా..! ఇంత మారిపోయిందా..? షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఆ నటి ఆమేనా..?

Highlights

షాపింగ్ మాల్ సినిమాలో సోఫియా పాత్రతో గుర్తింపు పొందిన సుకున నాగరాజన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి గురించి సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. తమిళ చిత్రమైన ‘అంగడి తేరు’ ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన అంజలి, ఆ చిత్రం తెలుగులో ‘షాపింగ్ మాల్’ పేరుతో డబ్ అయి మంచి ఆదరణ పొందింది. ఆ సినిమాలో ఆమె నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

తరువాత ‘జర్నీ’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అంజలి, తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇటీవల విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో కూడా అంజలి కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలు, అప్‌డేట్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

‘షాపింగ్ మాల్’ సినిమాలో సోఫియా పాత్రలో నటించిన నటి సుకున నాగరాజన్ కూడా అప్పట్లో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమె సినీరంగంలో పెద్దగా కనిపించలేదు. అనంతరం అదే చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజన్‌ను వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి వెల్లడించింది. గర్భధారణ సమయంలో జరిగిన అనుకోని సంఘటనలు, రంగు కారణంగా ఎదుర్కొన్న అవమానాలు తనను మానసికంగా బాధించాయని చెప్పింది. అయితే పెళ్లి తర్వాత తన జీవితంలో మార్పులు వచ్చాయని, కుటుంబ సహకారంతో తిరిగి సాధారణ జీవితం కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ‘షాపింగ్ మాల్’ సినిమా ద్వారా గుర్తింపు పొందిన ఈ నటి గురించి నెటిజన్లు మళ్లీ ఆసక్తిగా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories