Sabarimala Prasadam Online Booking: గుడ్ న్యూస్! శబరిమల ప్రసాదం నేరుగా మీ ఇంటికే - ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

Sabarimala Prasadam Online Booking
x

Sabarimala Prasadam Online Booking: గుడ్ న్యూస్! శబరిమల ప్రసాదం నేరుగా మీ ఇంటికే - ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

Highlights

Sabarimala Prasadam Online Booking: అయ్యప్ప ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే అరవణ పాయసం, అప్పం ఇప్పుడు నేరుగా ఇంటికే రావడానికి పోస్టల్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Sabarimala Prasadam Online Booking: మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభంతో శబరిమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. భక్తుల సందోహాన్ని నియంత్రించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్పాట్ బుకింగ్ టోకెన్ల సంఖ్యను పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేస్తోంది.

ఇంటికే శబరిమల ప్రసాదం

అయ్యప్ప ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే అరవణ పాయసం, అప్పం ఇప్పుడు నేరుగా ఇంటికే రావడానికి పోస్టల్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేవస్థానం బోర్డుతో కలిసి పోస్టల్ డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ప్రసాదాన్ని పంపే సేవను ప్రారంభించింది.

శబరిమల దర్శనం సాధ్యంకాని భక్తుల కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా అరవణ ప్రసాదం కిట్‌ను బుక్ చేసుకోవచ్చని శబరిమల పోస్టాఫీస్ ప్రకటించింది.

ప్రసాద కిట్‌లో ఏముంటుంది?

ప్రతి ప్రసాద కిట్‌లో ఇవి అందించబడతాయి:

నెయ్యి

♦ అరవణ పాయసం

♦ పసుపు

♦ కుంకుమ

♦ విభూతి

♦ అరచనై ప్రసాదం

అయ్యప్ప భక్తులందరికీ ఈ ప్రసాదం అందించడం లక్ష్యమని పోస్టల్ అధికారులు తెలిపారు. ఇందుకోసం ఇంటికి డెలివరీ సేవలను విస్తరించామని చెప్పారు.

ధరలు ఇలా ఉన్నాయి

♦ 1 టిన్ అరవణ కిట్ – ₹520

♦ 4 టిన్ అరవణ కిట్ – ₹960

♦ 10 టిన్ అరవణ కిట్ – ₹1,760

పోస్టాఫీసులో ధర చెల్లించి బుకింగ్ చేస్తే కొద్ది రోజుల్లోనే శబరిమల ప్రసాదం భక్తుల ఇంటికి చేరుతుంది.

మకరవిళక్కు అనంతర పరిస్థితులు

ప్రతి సంవత్సరం మకరవిళక్కు పూజ ముగిసిన తర్వాత అయ్యప్ప ఆలయం మూసివేయబడుతుంది. దీన్ని అనుసరించి శబరిమల పోస్టాఫీస్ కూడా లాక్ చేస్తారు. ఆ సమయంలో అందిన పార్సిల్స్‌ను భద్రపరిచే ఏర్పాట్లు ఉంటాయి.

శబరిమల ప్రసాదాన్ని ఇంటికే అందించే ఈ కొత్త సేవ భక్తులకి పెద్ద సౌలభ్యంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories