Viral Video: తల్లి బాధ్యత ఓవైపు... డ్యూటీ మరోవైపు... ఫుల్ వైరల్ అవుతున్న లేడీ కానిస్టేబుల్ వీడియో

RPF woman constable seen taking care of her baby while doing duty at New Delhi Railway station working women video goes viral
x

Viral Video: తల్లి బాధ్యత ఓవైపు... డ్యూటీ మరోవైపు... లేడీ కానిస్టేబుల్ వీడియో వైరల్

Highlights

RPF woman constable viral video : ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఆ మహిళను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఆమె ఒక తల్లి మాత్రమే కాదు... యోధురాలు కూడా అంటూ కాంప్లిమెంట్స్ గుప్పిస్తున్నారు.

పురుషులతో పోల్చుకుంటే, పనిచేసే మహిళలకు ఎన్నో సవాళ్లుంటాయి. అందులోనూ కుటుంబ బాధ్యతలు, ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉండే వారికి ఆ సవాళ్లు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అయినా సరే మహిళలు ఎక్కడా వెనుకడుగేయకుండా, ఆ సవాళ్లను లెక్కచేయకుండా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడుతుండటం గొప్ప విషయం.

వర్కింగ్ ఉమెన్ సమస్యలను క్లుప్తంగా చూస్తే... ఇంట్లో పనులు చక్కబెట్టుకుని డ్యూటీకి వెళ్తుంటారు. ఇంట్లో పిల్లల ఆలనపాలన చూసుకోవాల్సి ఉంటుంది. ఆ పిల్లలు మరీ చిన్న వాళ్లయితే ఆ రిస్క్ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు చూసుకునే వారు లేకపోతే అది ఇంకో రకమైన సమస్య. ఇప్పుడు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న మహిళ కానిస్టేబుల్‌కు కూడా అలాంటి సమస్యే వచ్చింది. అయినా సరే ఆమె డ్యూటీని దూరం పెట్టలేదు. అలాగని కన్నతల్లి బాధ్యతను కూడా పక్కకుపెట్టలేదు.

ఆ తల్లి ఒకేసారి రెండు బాధ్యతలు నిర్వర్తించేందుకు రెడీ అయ్యారు. అది కూడా ముఖంపై చిరునవ్వు పోకుండా, ముఖంలో అలసట అనేదే కనిపించకుండా రెండు బాధ్యతలు మోస్తున్నారు. అటు అమ్మగా, ఇటు ఆర్పీఫ్ కానిస్టేబుల్‌గా మెప్పిస్తున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మహిళా పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటన జరిగిన మరునాడు ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. వర్కింగ్ ఉమెన్స్‌కు మాత్రమే కాదు... వారికి అండగా నిలిచే కుటుంబాలకు కూడా భారీ బూస్టింగ్ ఇచ్చే ఈ వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.

ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఆ మహిళను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఆమె ఒక తల్లి మాత్రమే కాదు... యోధురాలు కూడా అంటూ కాంప్లిమెంట్స్ గుప్పిస్తున్నారు. జీవితం పట్ల, చేసే పని పట్ల కమిట్‌మెంట్ ఉంటే ఎంతటి కష్టాన్నానయినా చిరునవ్వుతో అధిగమించవచ్చు అని ఈ లేడీ కానిస్టేబుల్ ప్రూవ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories