Rose water: మెరిసే నిగారింపు కోసం రోజ్‌ వాటర్‌.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి..!

Rose Water in The Market May Be Adulterated Make Rose Water at Home
x

Rose water: మెరిసే నిగారింపు కోసం రోజ్‌ వాటర్‌.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి..!

Highlights

Rose water: మెరిసే నిగారింపు కోసం రోజ్‌ వాటర్‌.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి..!

Rose water: రోజ్ వాటర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీనిని బ్యూటీ ప్రొడాక్ట్స్‌లో ఎక్కువగా వాడుతారు. గులాబీ పువ్వులతో తయారుచేసే ఈ నీటిలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే మార్కెట్‌లో లభించే రోజ్ వాటర్ నిజమైనదా, కల్తీదా మనకి తెలియదు. అందుకే రోజ్ వాటర్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. దీని ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది. ఇంట్లో పెరిగే గులాబీ చెట్టు పువ్వులు తీసి రోజ్ వాటర్ తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం.

ముందుగా ఇంట్లో పెరిగే గులాబీ మొక్కల నుంచి గులాబీ పువ్వులని కోయాలి. తర్వాత దాని రెమ్మలని వేరుచేయాలి. వీటిని నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టాలి. తర్వాత తీసి మళ్లీ ఒకసారి శుభ్రం చేయాలి. తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసి రెమ్మలు మునిగిపోయేంత నీరు పోయాలి. ఎక్కువగా నీరు పోయకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల రోజ్‌వాటర్‌ మరింత పలుచన అవుతుంది. ఈ నీటిని వెచ్చగా తక్కువ వేడి మీద కాచాలి. నీరు అస్సలు మరగకూడదు. గిన్నెపై మూత పెట్టి ఉంచాలి.

గులాబీ పూల రెమ్మలు రంగు మారే వరకు నీటిని వేడి చేయాలి. ఆకుల రంగు తగ్గినప్పుడు రోజ్ వాటర్ తయారైందని అర్థం చేసుకోండి. చల్లారగానే వడగట్టి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి. రోజ్ వాటర్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. వేసవి కాలంలో టానింగ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దురద, మొటిమల వంటి చర్మ సమస్యలని తొలగిస్తుంది. దీనివల్ల మెరిసే నిగారింపు మీ సొంతమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories