
ఎవడు మమ్మీ వీడు.. రియల్ మోగ్లీలా ఉన్నాడు.. చెట్ల మీద కోతి కంటే ఫాస్టుగా దూకేస్తున్నాడు
Viral Video : చిన్నప్పుడు మనం పుస్తకాల్లో చదువుకున్న, టీవీల్లో చూసిన మోగ్లీ కథలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అడవిలో జంతువులతో కలిసి పెరగడం, కోతుల్లాగా చెట్లపై ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు గాలిలో తేలుతూ దూకడం మోగ్లీ స్పెషాలిటీ. అయితే అవన్నీ కేవలం గ్రాఫిక్స్ లేదా కల్పిత కథలని మనం అనుకుంటాం. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం.. "అరే! నిజంగానే మోగ్లీ భూమి మీదకు వచ్చేశాడా?" అనిపించక మానదు. ఒక వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా, అత్యంత వేగంతో చెట్లపై కోతి కంటే వేగంగా దూకుతున్న దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి.
ఈ వైరల్ వీడియో ఒక దట్టమైన అడవిలో మొదలవుతుంది. చుట్టూ ఆకాశాన్నంటే ఎత్తైన చెట్లు, పచ్చని ప్రకృతి కనిపిస్తుంది. ఆ చెట్లపై ఒక వ్యక్తి అసలు భూమి మీద నడుస్తున్నంత ఫ్రీగా చెట్ల కొమ్మలపై పరుగులు పెడుతున్నాడు. ఒక చెట్టు కొమ్మ నుంచి మరో చెట్టుకు అతను దూకుతున్న తీరు చూస్తుంటే కళ్లు చెదిరిపోవాల్సిందే. గాలిలో పల్టీలు కొడుతూ, బ్యాలెన్స్ తప్పకుండా అతను ప్రదర్శిస్తున్న నైపుణ్యం చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. కొందరైతే ఇతను మోగ్లీకి అయ్యలా ఉన్నాడే అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు అంత ఎత్తులో బ్యాలెన్స్ తప్పితే ప్రాణాలకే ముప్పు అని తెలిసినా, అతను మాత్రం చిరుతపులిలా చెట్లపై దూసుకుపోతున్నాడు.
Parkour on a tree
— Science girl (@sciencegirl) February 28, 2026
📹Anthony Denis
pic.twitter.com/BwF7kVzgBd
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో షేర్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్ సాధించింది. అయితే ఈ వీడియోను చూసిన చాలామంది ఇది అసలైన వీడియో కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించిన ఫేక్ వీడియో అని వాదించారు. మనిషికి అంత వేగం, అంత బ్యాలెన్స్ ఉండటం సాధ్యం కాదని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని ఒక యూజర్ బయటపెట్టాడు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ డెనిస్. అతను ఒక ప్రొఫెషనల్ పార్కర్ అథ్లెట్. చెట్లపై పార్కర్ చేయడంలో అతను ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు.
ఆంథోనీ డెనిస్ గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సాహసకృత్యాలకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. దీనికోసం అతను ఏళ్ల తరబడి కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. కేవలం చెట్లపైనే కాకుండా, ఎత్తైన భవనాలపై కూడా అతను ఇలాంటి విన్యాసాలు చేస్తుంటాడు. ఈ 46 సెకన్ల వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. మనిషి తలచుకుంటే అసాధ్యం అంటూ ఏదీ లేదని, మోగ్లీ లాంటి విన్యాసాలు కూడా నిజ జీవితంలో సాధ్యమేనని ఆంథోనీ నిరూపించాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అతని ధైర్యానికి, వేగానికి ఫిదా అయిపోతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




