AI Warfare: యుద్ధ భూమిలోకి ఏఐ..?

AI Warfare
x

AI Warfare

Highlights

AI Warfare: యుద్ధ భూమిలోకి ఏఐతో ముప్పు తప్పదని రీఎయిమ్‌ బ్లూప్రింట్‌ కోరింది. దీన్ని కంట్రోల్ చేయాలని, వినియోగంపై కొన్ని మార్గదర్శకాలు రూపకల్పన చేయలని తెలిపింది.

AI Warfare: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న కొత్త టెక్నాలజీ. ఏఐతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఉద్యోగాలు పట్టుకొస్తాయని మరొక వైపు ఆనందం కూడా ఉంది. ఈ ఏఐ ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు యుద్ధ రంగంలోకి కూడా కృత్రిమ మేధ చొరబడుతోంది. యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం చూసి వచ్చే రకం కాదు.. ఏకంగా కాల్చి వచ్చే రకం.. సాయుధులైన శత్రువులను నాశనం చేస్తే పెద్దగా తప్పులేదు. కానీ.. దీని వల్ల అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఏఐని నియంత్రించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. యుద్ధంలో ఏఐను ఎవరు కంట్రోల్‌ చేయాలి? ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఎందుకు ఏఐతో ముప్పు ఎర్పడుతోంది?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. దీన్ని షార్ట్‌లో ఏఐ అని పిలుస్తారు. ఇప్పుడు మనిషి జీవితంలోకి మరింత లోతుగా ఏఐ చొచ్చుకు వస్తోంది. ఇప్పటికే కృత్రిమ మేధ చాలా దూరం వచ్చేసింది. సినిమాల్లోనూ ఏఐ మెయిన్ విలన్‌‌గా మారుతోంది. మానవత్వాన్ని అంతం చేసే దళంగా సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు అదే కృత్రిమ మేధస్సును సహాయకుడిగా ఉండాలని పలు దేశాలు సైన్యాలు కోరుకుంటున్నాయి. తాజాగా దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో 60 దేశాలకు చెందిన ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సదస్సు పేరు రీ-ఎయిమ్‌.

రీఎయిన్‌ అంటే.. రెస్పానిస్సిబుల్‌ ఫర్ ఏఐ ఇన్ ద మిలటరీ. రీఎయిమ్‌ తొలి సదస్సు నెదర్లాండ్‌ రాజధాని నగరం ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో గతేడాది జరిగింది. చాలా దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. అందులో 60 దేశాలు చర్యలకు పిలుపునిచ్చాయి. ఇది కేవలం ప్రకటన మాత్రమే. ఎలాంటి న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోలేదు. అయితే ఈసారి రిఎయిమ్‌ మరో అడుగు ముందుకేసింది. మిలటరీలు ఏఐను ఉపయోగించడంపై ఓ బ్లూప్రింట్‌ను రూపొందించాయి. ఈ బ్లూ ప్రింట్‌లో కొన్ని ఆచరణాత్మక మార్గదర్శకాలు ఉన్నాయి.

కానీ.. వాటికి కూడా ఎలాంటి చట్టబద్దత లేదు. సదస్సు నుంచి అత్యంత శక్తివంతమైన సందేశాన్ని ఇస్తున్నట్టు రిఏయిమ్‌ తెలిపింది. అంతర్జాతీయంగా ఏఐ విషయంలో సహకారం తీసుకోవాలని కెన్యా పిలుపునిచ్చింది. అద్భుతమైన సామర్థ్యమున్న ఏఐ సాంకేతికతతో క్లిష్టమైన నైతిక భద్రత, పాలనా సవాళ్ల ఉన్నట్టు తెలిపింది. ఈ సవాళ్లను ఏ దేశం ఒంటరిగా ఎదుర్కొనడం అసాధ్యమని కెన్యా వెల్లడించంది.

రీఎయిమ్‌ బ్లూప్రింట్‌ ముఖ్య ఉద్దేశం రక్షణ కల్పించడమే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మిలటరీ అప్లికేషన్లను పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడమే ఈ బ్లూ ప్రింట్‌ ముఖ్య ఉద్దేశం. అయితే అన్ని దేశాలు దీనికి ఆసక్తి చూపడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ చైనా. వాస్తవానికి బీజింగ్ కూడా సియోల్‌లో జరిగిన సదస్సుకు తమ ప్రతినిధిని పంపింది. కానీ బ్లూప్రింట్‌కు మాత్రం బీజింగ్ మద్దతు ఇవ్వలేదు. భారత్‌ సైతం అలాంటి అడుగే వేసింది. హేగ్‌లో కార్యాచరణ పిలుపును ఆమోదించలేదు.

సియోల్‌లోని బ్లూ ప్రింట్‌ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సింపుల్‌గా చెప్పాలంటే.. రీ-ఎయిమ్‌ బ్లూప్రింట్‌ను ఢిల్లీ ఒప్పుకోలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఏఐని మిలటరీలో ఉపయోగించే అంశంపై ప్రపంచ దేశాలు ఒకే విధానాన్ని అనుసరించడం లేదు. ఇదే మనల్ని ప్రాథమిక ప్రశ్నల వద్దకు తీసుకెళ్తుంది. రీ-ఎయిమ్ ఎలా పని చేస్తుంది?. ఏఐను యుద్ధంలో ఎలా వినియోగిస్తారు?. ఏఐతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి?. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌‌ వినియోగం వరమా? శాపమా?. ముందుగా ఏఐ ప్రయోజనాలు చూద్దాం.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ అనేది యుద్ధ రంగంలో వినియోగించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే యుద్ధాల్లో ఏఐ అంతర్భాగంగా మారింది. ప్రాథమికంగా రవాణా వంటి అంశాల్లో కృత్రిమ మేధస్సు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇటీవల వెలువడిన ఓ అధ్యయనాన్ని చూడండి. ఏ-10సీ యుద్ధ విమానంలో ఏఐను అనుసధానం చేశారు.

ఏ-10సీ యుద్ధ విమానానికి మరమ్మతులు ఎప్పుడు అవసరమో ఏఐ అంచనా వేస్తుంది. దీంతో అమెరికాకు ప్రతి నెల 2 కోట్ల 50 లక్షల డాలర్లు ఆదా అవుతాయి. అందుకే యూఎస్ ఆర్మీ పెద్ద ఎత్తున ఏఐను వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ఆర్మీ ఫైళ్లను పరిశీలించడమంటే పరమ బోర్‌గా ఉండే పని. దీన్ని ఏ మనిషీ ఆనందంగా చేయలేడు. అందుకే పైళ్లను పరిశీలించే పనిని యూఎస్ సైన్యం ఏఐకి అప్పగించింది. ఏఐ మోడల్‌ దాదాపు లక్షా 40వేల వ్యక్తిగత ఫైళ్లను పరిశీలిస్తుంది.

ఆర్మీ అధికారుల ప్రమోషన్లకు సంబంధించిన స్కోర్‌ను ఏఐ అందిస్తుంది. చిన్న ఉద్యోగాల విషయలో ఏఐ సహాయం అత్యద్భుతమనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. యుద్ధ రంగంలో ఏఐ పాత్ర మాటేమిటి? యుద్ధ రంగంలో కూడా ఏఐను వినియోగిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి గాజా వరకు యుద్ధం తీరు తెన్నులను ఏఐ పూర్తిగా మార్చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను డ్రోన్లలో వినియోగిస్తున్నారు. ఆటోమెటిక్‌ సెన్సార్లకు కూడా ఏఐ అనుసంధానం చేశారు. అవే కాకుండా స్వయంగా నిర్ణయం తీసుకునేలా కొన్ని టూల్స్‌‌ను ఏఐ ద్వారా రూపొందిస్తున్నారు.

కొన్ని మిలటరీలు.. ఏఐను అదనపు బలంగా పేర్కొంటున్నాయి. ఎందుకంటే.. వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడంలో... ముందస్తుగా లక్ష‌్యాన్ని గుర్తించడంలో, మానవ ముప్పును తప్పించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే యుద్ధంలో కొత్త సైనిక విభాగంగా.. కొత్త ఫోర్స్‌గా ఐఏ మారుతోంది.

అయితే యుద్ధంలో ఏఐతో సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఆన్‌ పేపర్‌, అల్గారిథమ్‌ పరంగా యుద్ధంలో ఏఐ చేసే విన్యాసాలు అద్భుతమనే చెప్పాలి. కానీ.. యుద్ధంలో అది ఎలా దాడి చేస్తుందనేది స్పష్టంగా చెప్పలేము. ఉదాహరణకు లావెండర్‌ను తీసుకోండి. లావెండర్ అనేది ఇజ్రాయెల్‌ ఉపయోగించే ఏఐ ఆధారిత వ్యవస్థ. లావెండర్ వద్ద గాజాలోని ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి. తన వద్ద ఉన్న డేటా ఆధారంగా అక్కడి ప్రజలు హమాస్ మిలిటెంట్లా? కాదా? అనేది నిర్ధారిస్తోంది. అయితే లావెండర్ ఎంత కచ్చితత్వంతో పని చేస్తోంది?

అంటే.. 90 శాతం కచ్చితత్వంతో పని చేస్తోంది. ఉదాహరణకు హమాస్‌ ఉగ్రవాదులను వందమందిని గుర్తించిందనుకోండి.. అందులో 10 మంది అమాయకులు ఉంటారన్నమాట. లావెండర్‌ మొత్తం 37 వేల మందిని హమాస్ ఉగ్రవాదులుగా గుర్తించింది. అంటే.. అందులో 10 శాతం మంది అమాయకులు కూడా ఉంటారు. యుద్ధంలో ఇలాంటి టెక్నాలజీని అనుమతించడం దారుణమైనే విషయం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తీవ్రమైన నష్టం ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. ఏఐతో నష్టాలకు మరో ఉదాహరణ చూద్దాం. 2020లో లిబియాలో సైనికులను కిల్లర్ డ్రోన్ వేటాడింది. కానీ.. ఈ వేటలో అమాయక పౌరులను కూడా కిల్లర్ డ్రోన్ హతమార్చింది. ఈ ఏఐ ఎవరి ఆదేశాలను పాటించడం లేదు.. అది స్వతంత్రంగా లిబియాలో దాడి చేసింది. ఇదే అత్యంత ప్రమాదకరమైన పరిమాణం. లక్ష్యాలను గుర్తిండచంలో ఏఐ సమర్థవంతంగా పని చేస్తోంది. కానీ.. శత్రువులు, అమాయకులను గుర్తించడంలో మాత్రం విఫలమవుతోంది. ఇదే ఏఐ లోపాలను బయటపెడుతోంది.

యుద్దాల్లో ఏఐను వినియోగించడం ప్రాణాంతకంగా మారవచ్చు. ఇక్కడ నైతిక ప్రశ్న కూడా ఉంటుంది. ఒకవేళ మిషన్‌ పొరబాటు చేస్తే దానికి ఎవరు బాధ్యులు?. ఆ మిషన్‌ను బాధ్యులు చేస్తారా? లేక దాన్ని తయారీదారుడా? లేక వినియోగించిన ఆర్మీని బాధ్యులు చేస్తారా? ఇందులో ఎవరిని నిందించాలి?. మరొక డేంజర్ ఏమిటంటే... ఏఐతో అణ్వాయుధాల ప్రయోగం. ఒక చిన్న తప్పు జరిగినా.. లక్షల మంది ప్రమాదంలో పడుతారు. సంఘర్షణ సమయంలో ఊహించని విధంగా ఏఐతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ఇదే విషయంపై రీ-ఎయిమ్‌ సమ్మిట్‌లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో టే-యుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణల్లో అనాలోచితంగా ఏఐను వినియోగిస్తే ముప్పులు తప్పవన్నారు. అల్గారిథమ్‌‌లో వైఫల్యాల ఫలితంగా.. మానవ నాశనం తప్పదని హెచ్చరించారు. సో.. స్పష్టంగా చెప్పాలంటే... ఏఐతో ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. కానీ.. మన భవిష్యత్తు టెక్నాలజీ ఏఐ. కాబట్టి.. దేశాలు కూడా కాలానికి అనుగుణంగా మారాలి. ప్రస్తుతం ఏఐ విషయంలో రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలి. మొదటిది.

ఏఐ ఆధారిత ఆయుధాలను మనుషులు పర్యవేక్షించాలి. ఏఐ కచ్చితమైన లక్ష్యాన్ని అంచనా వేయగలదు. కానీ.. దాన్ని మనుషులు తప్పకుండా సమీక్షించాలి. చివరి అటాక్‌ను పర్యవేక్షించాలి. ఇక రెండోది.. ఏఐను పూర్తిగా పరీక్షించిన తరువాతే.. యుద్ధ రంగంలోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే.. ఏ మాత్రం పరీక్షించని దాన్ని యుద్ధంలోకి తీసుకెళ్తే ప్రమాదాలు తప్పవు. యుద్ధ భూమిలో జీవితానికి, మరణానికి చాలా చిన్న వ్యత్యాసం మాత్రమే ఉంటుంది.

వాస్తవానికి ఏఐ ప్రమాదకరమని తెలిసినా.. ప్రపంచ దేశాలు దాని కోసం ఆరాటపడుతున్నాయి. శత్రు దేశం కంటే ఏ మాత్రం వెనుకపడ కూడదని.. ఏ దేశానికి ఆ దేశం.. ఏఐని అందిపుచ్చుకునేందుకు ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలో కోట్ల డాలర్లను వెచ్చిస్తున్నాయి. ఏఐ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే.. ప్రపంచం ఎలాంటి విప్తతును ఎదుర్కొంటుందో... అందుకే ఏఐను కంట్రోల్‌ చేయాలని రీ-ఎయిమ్‌ కోరుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories