ప్రాణం పోసుకున్న చికెన్ ముక్క! ముక్కున వేలేసుకున్న ప్రపంచం!!..

ప్రాణం పోసుకున్న చికెన్ ముక్క! ముక్కున వేలేసుకున్న ప్రపంచం!!..
x
Highlights

చికెన్ ముక్కకి ప్రాణం వచ్చింది. అదేంటి అని ఆశ్యరపోకండి. ఒక్కసారి ఈ స్టోరిలోకి ఎంటర్ అయితే మీకే అర్థమౌతోంది. సాధారణంగా కోడిని ముక్కలుగా నరికిన తర్వాత...

చికెన్ ముక్కకి ప్రాణం వచ్చింది. అదేంటి అని ఆశ్యరపోకండి. ఒక్కసారి ఈ స్టోరిలోకి ఎంటర్ అయితే మీకే అర్థమౌతోంది. సాధారణంగా కోడిని ముక్కలుగా నరికిన తర్వాత కూర వండుకొని తినేస్తాం. అదే వంటకానికి ముందు చికెన్‌ని ఓ ప్లేట్‌లో పెడతాం కదా. ఆ ప్లేట్ ఉన్న చికెన్ ముక్క బతికి ఉండటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? చికెన్ ముక్క ప్లేట్ నుండి ఎగిరిపడటం చూశారా? అదేంటి చికెన్ ముక్కకి ప్రాణం రావాడం ఎంటీ? చికెన్ ముక్క ఎగిరి పడటం ఏంటి అని ఆశ్యర్యపోతున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ కథనం చదవాల్సిందే మరి.. ఇక వివరాల్లోకి వెళితే ఫ్లోరిడాకు చెందిన రియా ఫిలిప్స్ అనే యువతి ఇటీవల ఓ వీడియోను పెట్టింది. అందులో ఓ రెస్టారెంట్‌లోని ఓ టైబుల్‌పై ఉంచిన ప్లేట్‌లో పచ్చి మాంసం ముక్కలున్నాయి.

అందులో ఉన్న ఓ చికెన్ ముక్కకు అకస్మాత్తుగా ప్రాణం వచ్చింది. అది ప్లేటు మీద నుంచి బల్ల పైకి దూకి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో... ఆ టైబుల్ దగ్గర కూర్చున్నవాళ్లు భయంతో, ఆశ్చర్యంతో అరిచినట్లుగా అరుపులు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది ఏ రెస్టారెంట్‌లో జరిగిందనేది మాత్రం క్లారిటీలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ముక్కున వేలేసుకుంటున్నారు. అప్పుడే కోడిని కోసుంటారు.. అందుకే ఇలా జరిగి ఉంటుందని తేలికగా తీసిపారేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఇది నిజంగా జరిగిందా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరికొందరు.. ఆకోడికి అసలు చావాలని లేనట్టుంది.. అందుకే చచ్చినంక కూడా చావును అంగీకరించడం లేదంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు. అసలు ఇది నిజమా? కల్పితమా? అనే సందిగ్ధంలో పడేస్తూ..ప్రతిఒక్కరిని నోరేళ్లబెట్టేలా చేస్తోంది. మొత్తానికి ఈ వీడియో చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ చూస్తూ.. షేర్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories