Top
logo

వడదెబ్బకు గురైతే ఇలా చేయాలి!

వడదెబ్బకు గురైతే ఇలా చేయాలి!
X
Highlights

ఎర్రటి ఎండ.. తప్పనిసరి ప్రయాణం.. బైక్ మీద వెళ్లి వచ్చారు. వచ్చిన కొద్దిసేపటికి అలసటగా ఉన్నట్లు, కడుపులో...

ఎర్రటి ఎండ.. తప్పనిసరి ప్రయాణం.. బైక్ మీద వెళ్లి వచ్చారు. వచ్చిన కొద్దిసేపటికి అలసటగా ఉన్నట్లు, కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది. చాలాసేపు అలానే ఉంది. తరువాత రెండు సార్లు వాంతి అయింది.. ఇదేదో మధ్యాహ్నం తిన్నది అరగకపోవడం వల్లే అని అనుకుని అశ్రద్ధ చేశారో, ఇక అంతే సంగతులు. ఇవి వడదెబ్బ ప్రాథమిక లక్షణాలు. ఎండలో ఎక్కువసేపు తిరగడం లేదా పని చేయడం తో వచ్చే ఇబ్బంది ఇది.

వడదెబ్బ ఎందుకు తగులుతుంది?

వడదెబ్బకు వైద్య భాషలో ఢీఫీషయన్సీ హీట్ ఎక్సాస్టన్ అని పేరు. అంటే వేడి వలన శరీరంలో నీటిని కోల్పోవడం వాళ్ళ వచ్చే ఇబ్బందన్న మాట. ఎండాకాలంలో శారీరకశ్రమ చేసే వారికి ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎండ వేడికి శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. దాంతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. సాధారణంగా ఆరుబయట పనిచేసేవాళ్ళు గాలి తగినంతలేని ప్రదేశంలో పని చేసేవాళ్ళలోనే కాకుండా ఇతరులకు కూడా ఇలాంటి స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. చల్లని స్థలాలలో ఉంటూ హఠాత్తుగా ఎండలు ఎక్కువ ఉండే ప్రదేశాలకు వచ్చే వారికి కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది.

మామూలుగా ఎండవేడి, పరిసరాల ఉష్ణోగ్రత పరిగినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత ఆ వేడికి సమానంగా పెరగకుండా చర్మంలో ఉన్న చెమట గ్రంధులు, రక్తనాళాలు, సున్నితమైనా నరాలు చాలా జాగ్రత్త పడతాయి. ఈ విషయంలో మెదడులో ఉండే "హీట్ రెగ్యూలేటర్" ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎండవేడి ఎక్కువ ఉన్నప్పుడు, వడ గాడ్పులు వీస్తున్నప్పుడు చమట ఎక్కువ పడుతుంది. ఇలా ఎక్కువ చమట పట్టడంవల్ల శరీరం చల్లబడుతుంది. ఈ రకంగా చర్మం శరీరానికి సహజమైనా "ఎయిర్ కూలర్" గా వ్యవహరింస్తుందికాని శరీరం చాలా సేపు ఎక్కువ వేడికి అయినప్పుడు స్వేద గ్రంధులు క్రమంగా అలసిపోతాయి . చమట పట్టడం ఆగిపోయి శరీరం వేడి ఎక్కి వడదెబ్బ తగులుతుంది.

లక్షణాలు ఇవీ..

మొదట్లో రోజూ కొద్దిగా పనిచేయగానే త్వరగా అలసిపోతూ వుంటారు. ఆకలి మందగించడం, కడుపులో వికారం. తలనొప్పి. కండరాల నొప్పులు, ఒళ్ళు తూలడం లాంటి లక్షణాలు వుంటాయి. తరువాత కొంత బరువు కూడా కోల్పోతారు . ఎపుడూ నీరసంగా వున్నట్టు అనిపిస్తూ యుంటుంది. జ్వరం వస్తున్నట్టు అనిపిస్తుంది. చమట ద్వారా ఉప్పు, నీరు పోవడంతో జ్వరం తీవ్రత పెరిగి కొందరు అపస్మారక స్థితికి లోనయ్యేప్రమాదం ఏర్పడుతుంది. వడదెబ్బ లక్షణాలు కొందరికి రోజూ కొద్దో, గొప్పోవున్నట్టు అనిపిస్తూ కొంతకాలానికి తీవ్రరూపం దాలుస్తుంది. హీట్ ఎక్సాస్టన్ ఒక మాదిరిగా వచ్చిన వారిలో రక్తం మామూలుగా కంటె తగ్గిపోతుంది. కూర్చున్నవాళ్ళు లేచి నిలబడగానే కళ్ళు బైర్లుకమ్మి, తల తిరుగుటునట్లు అయి పడిపోతారు . గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది. మూత్ర విసర్జన తగ్గిపోతుంది. రక్తంలో నీరు శాతం తగ్గిపోతుంది. మొదల్లోనే ఈ లక్షణాలను గుర్తించి ఈ పరిస్తితులని చక్కదిద్దడం అవసరం. లేకపోతే కొందరు హఠాత్మరిణామాలకుటట్టుకోలేరు. సరైన ప్రాథమిక చికిత్స చేయకపోతే ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. చమటపట్టడం ఆగిపోయి చర్మం ఏమది నట్లయి వేడిగామరి, శరీర ఉష్ణోగ్రత106డిగ్రీలకిపెరిగితేనే వడదెబ్బ తగిలినట్లు చెప్పొచ్చు.

ప్రాథమిక చికిత్స ఇలా..


వడదెబ్బకు గురైన వ్యక్తిని చల్లని ప్రదేశంలో విశ్రాంతిగా పడుకోబెట్టాలి. తాగాడానికి ఉప్పు కలసిన నీళ్ళు గాని, మజ్జిగగాని ఎక్కువగా ఇవ్వాలి. ఉప్పు లేకుండా కేవలం చల్లని మంచి నీళ్ళు తగ్గించినా ఫలితం వుండడు. ఒక మాదిరిగా వడదెబ్బ లక్షణాలు కనబడిన వాళ్ళకి 24గంటల్లో 5లీటర్లకి తక్కువ కాకుండా తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. కనీసం 25గ్రాముల ఉప్పు రోజు మొత్తం మీద తీసుకునేలా చూడాలి. వడదెబ్బ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే వడదెబ్బకు తీవ్రమైన జ్వరం వుంటుంది. కనుక ఆ వ్యక్తిని చల్లగా చన్నీళ్ళతో తడిపిన వస్త్రాలతో చుట్టివుంచాలి. చల్లగా వుండేప్రదేశంలో పడుకోబెట్టాలి. ఇంటి గుమ్మానికి, కిటికీలకు వట్టివెళ్ళ తడకలుగాని, తడివస్రాలుగాని, కట్టి వాటిని మాటిమాటికి తడపాలి. వీలయితే ఆ వ్యక్తిని అయిస్ ముక్కలు వేసిన చన్నీళ్ళ తొట్టిలో కూర్చోబెట్టాలి. ప్రతి అయిదు నిమిషాలకు టెంపరేచరుచూస్తూ జ్వరం 102 డిగ్రలకి దిగాక ఐస్ వాడటం మాని వేసి వేరుగా పడుకోబెట్టాలి. జ్వరం త్వరగా 100 డిగ్రీలకంటె తక్కువ స్థాయికి డిగిపోకుండా చూడాలి. నిమిషాల్లో జ్వరం తగ్గిపోయి ఒళ్ళు చల్లబడి పోయినా ప్రమాదమే. ఈస్థితిలో వైద్యులను సంప్రదించి వారి సలహాలను పాటించడం అవసరం.

.

Next Story