కుక్క రక్షణలో పోలీసులు!

కుక్క రక్షణలో పోలీసులు!
x
Highlights

ఆ కుక్క పేరు జిమ్మీ.. లాబ్రడార్ జాతి కుక్క.. దీనిని మధ్యప్రదేశ్ లోని బీనా పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం నలుగురు పోలీసులు సంరక్షిస్తున్నారు. ఉదయం,...

ఆ కుక్క పేరు జిమ్మీ.. లాబ్రడార్ జాతి కుక్క.. దీనిని మధ్యప్రదేశ్ లోని బీనా పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం నలుగురు పోలీసులు సంరక్షిస్తున్నారు. ఉదయం, సాయంత్రం దానిని తిప్పడం, సమయానికి ఆహారం అందించడంలో తలమునకలవుతున్నారు. పైగా ఆ శునకం కోసం ప్రత్యేకంగా కూలర్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇంత చక్కని భోగం దక్కిన జిమ్మీ కథ ఏంటంటే..

బీనాలోని గణేష్‌వార్డు నివాసి మనోహర్ అహిర్వార్, అతని కుమారుడు ప్రశాంత్‌లు జూన్ 21న తమ ఐదుగురు కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి హత్యచేశారు. ఈ ఉదంతంలో పోలీసులు మనోహర్, ప్రశాంత్, ప్రవీణ్‌లతో పాటు మనోహర్ భార్య, ఇద్దరు కుమార్తెలను అరెస్టు చేశారు. దీంతో వారంతా కటకటాల పాలయ్యారు. అయితే, ఈ నిందితులు తమతో పాటు జిమ్మీని పెంచుకుంటున్నారు. వీరంతా జైలు పాలు కావడంతో జిమ్మీ పాపం ఒంటరిదైపోయింది. రెండు రోజులు ఒంటరిగా ఇంట్లో తిండి లేకుండా ఉండిపోయింది. అక్కడి ఇరుగూ..పొరుగూ ఇది గమనించి పోలీసులక్కు విషయం చెప్పారు. దాంతో వారు రెండు రోజుల పాటు రోజూ వెళ్లి ఆహారాన్ని ఇచ్చి వచ్చేవారు. ఈ నేపథ్యంలో జిమ్మీ వారికి మచ్చిక అయిపోయింది. దానిని చూసుకొమ్మని అక్కడి వారిని అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. దీనితో జిమ్మీని తమతో పాటు తీసుకువెళ్ళి జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అదండీ సంగతి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories