PM Kisan Yojana: ఈ ప‌ని చేయ‌క‌పోతే.. పీఎం కిసాన్ డ‌బ్బులు ప‌డ‌వు. వెంట‌నే అల‌ర్ట్ అవ్వండి

PM Kisan Yojana: ఈ ప‌ని చేయ‌క‌పోతే.. పీఎం కిసాన్ డ‌బ్బులు ప‌డ‌వు. వెంట‌నే అల‌ర్ట్ అవ్వండి
x
Highlights

PM Kisan Yojana: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద వచ్చే 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే ప్రభుత్వం ఈ నెలలో 20వ విడత నిధులు విడుదల చేయనుంది. అయితే, ప్రతి రైతుకు డబ్బులు జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిగా చేసి ఉండాలి.

20వ విడత నిధుల కోసం తప్పనిసరిగా చేయాల్సినవి:

e-KYC పూర్తి చేయాలి:

రైతులు తప్పనిసరిగా తమ e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది పూర్తి కాకపోతే డబ్బులు ఖాతాలోకి రావు.

ఈ-కేవైసీ ఎలా చేసుకోవాలంటే..

* PMKisan.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

* ‘Kisan Corner’ సెక్షన్‌కి వెళ్లి ‘e-KYC’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి

* అక్కడ ఆధార్ నంబర్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి. దీంతో e-KYC పూర్తి అవుతుంది.

ఆధార్, బ్యాంక్ లింక్:

రైతుల బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అప్పుడే DBT (Direct Benefit Transfer) ద్వారా డబ్బులు నేరుగా ఖాతాలోకి వస్తాయి.

భూ రికార్డుల ధృవీకరణ:

రైతుల భూమి వివరాలు ప్రభుత్వ భూ రికార్డులతో సరిపోయేలా వెరిఫై చేయాలి. భూమి లేనివారికి ఈ పథకం వర్తించదు.

మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలి:

మీ ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్ ప్రస్తుతం యాక్టివ్‌గా ఉందో లేదో చూసుకోవాలి. OTPలు అందుకోవడానికి ఇది అవసరం.

పీఎం కిసాన్ పథకం వివరాలు:

ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.6000 రైతుల ఖాతాల్లో జమ అవుతుంది మూడు విడతల్లో, ప్రతి విడతలో రూ.2000 చొప్పున DBT ద్వారా జమ చేస్తారు ఈ పథకం 2019లో ప్రారంభమైంది. 12 కోట్లకు పైగా రైతులు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories