పెన్షన్ దారులు, పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్.. వెంటనే ఈ పనులు పూర్తి చేయండి..

Pensioners EPF Clients Alert Complete These Tasks Immediately | Telugu Online News
x

పెన్షన్ దారులు, పీఎఫ్ ఖాతాదారులు అలర్ట్.. వెంటనే ఈ పనులు పూర్తి చేయండి..

Highlights

Pensioners: డిసెంబర్ 1 నుంచి సామాన్యుడి జీవితంలో చాలా మార్పులు జరుగబోతున్నాయి...

Pensioners: డిసెంబర్ 1 నుంచి సామాన్యుడి జీవితంలో చాలా మార్పులు జరుగబోతున్నాయి. ముఖ్యమైన పనులకు సంబంధించి నిబంధనలు మారుతున్నాయి. మీరు ఈ విషయం తెలుసుకొని అప్రమత్తమవండి. లేదంటే చాలా నష్టపోయే అవకాశం ఉంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని ఆధార్‌తో లింక్ చేయడం డిసెంబర్ 1, 2021 నుంచి పూర్తిగా తప్పనిసరి అవుతుంది. మీరు మీ UAN నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మీ PF డబ్బు నిలిచిపోతుంది.

EPFO ఖాతాలో డబ్బు డిపాజిట్ కాదు

మీ UAN నంబర్, ఆధార్ లింక్ చేయకపోతే మీ కంపెనీ EPFO ఖాతాలో డబ్బును డిపాజిట్ చేయదు. అంతేకాదు మీరు మీ EPFO ఖాతా నుంచి డబ్బును విత్‌ డ్రా చేసుకోలేరు. అందుకే కచ్చితంగా ఈ పని చేయండి. లేదంటే చాలా నష్టపోతారు. మెంబర్ సర్వీసెస్ పోర్టల్, UMANG యాప్, EPFO ​​e-KYC పోర్టల్‌ని సందర్శించి UANని ఆధార్‌తో సులభంగా లింక్ చేయవచ్చు.

లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి తేదీ

ప్రభుత్వం నుంచి ప్రతి నెల పెన్షన్ పొందాలంటే లైఫ్ సర్టిఫికేట్ అవసరం. అయితే ఈ సర్టిఫికెట్‌ సమర్పించడానికి నవంబర్‌ 30 చివరితేది. పెన్షన్ పొందాలంటే లబ్ధిదారుడు జీవించి ఉన్నాడని చూపే జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం అవసరం. డిసెంబర్ 1 నుంచి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన వారకే పెన్షన్ అందుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories