Viral News: ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్‌.. ఇప్పుడు డెలివరీ బాయ్‌!

Viral News: ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్‌.. ఇప్పుడు డెలివరీ బాయ్‌!
x

Viral News: ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్‌.. ఇప్పుడు డెలివరీ బాయ్‌!

Highlights

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌ కుదేలవుతోన్న తరుణంలో.. అత్యున్నత విద్యాభ్యాసం చేసినవారికీ సరైన ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌ కుదేలవుతోన్న తరుణంలో.. అత్యున్నత విద్యాభ్యాసం చేసినవారికీ సరైన ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. అలాంటి ఒక ఉదాహరణే చైనాకు చెందిన డింగ్ యువాన్‌జావో. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసిన ఈ 39 ఏళ్ల విద్యావేత్త, ప్రస్తుతం సింగపూర్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డింగ్ విద్యార్హతలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. చైనాలోని గావోకావో ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో 750లో 700 మార్కులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన డింగ్, తత్సమయంలో సింఘువా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాడు. అనంతరం పెకింగ్ యూనివర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్, సింగపూర్ NTU నుంచి బయాలజీలో పీహెచ్‌డీ, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో బయోడైవర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు.

అంతటి విద్యతో కూడిన డింగ్‌కు ఉద్యోగం దొరకలేదు. NUS లో పోస్ట్‌డాక్ రీసెర్చ్ పూర్తి చేసిన తర్వాత జాబ్ సెర్చ్ మొదలుపెట్టాడు. కానీ 10 ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఒక్క అవకాశమూ రావడంలేదు. ప్రైవేట్ ట్యూషన్ ట్రై చేసినా.. క్లయింట్స్ దొరకకపోవడంతో చివరకు ఫుడ్ డెలివరీ రైడర్‌గా మారాడు.

ప్రస్తుతం డింగ్ రోజుకు 10 గంటలు డెలివరీ చేసేందుకు సైక్లింగ్ చేస్తూ, వారానికి సుమారు SG$700 (రూ. 47,000) సంపాదిస్తున్నాడు. “ఇది ఓ స్థిర ఆదాయం. ఇది ఓటమి కాదు. నా కుటుంబాన్ని పోషించడానికి ఇదే మార్గం. ఫుడ్ డెలివరీ చెయ్యడం చెడ్డ విషయమేమీ కాదు. అదే సమయంలో ఎక్సర్‌సైజ్ కూడా అవుతుంది” అని డింగ్ చెబుతున్నాడు.

ఆయన కథ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చలకు దారి తీసింది. చదువు ఉన్నా ఉద్యోగం రావడం లేదన్న దానిపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే డింగ్ పాజిటివ్ ఆలోచనలతో విద్యార్థులకు సందేశం ఇస్తున్నాడు – “మార్కులు తక్కువ వచ్చాయంటే భయపడవద్దు. మార్కులతోనే జీవితాన్ని నిర్ణయించలేం. జాబ్ ఉండాలంటే స్కోర్ కంటే బలం మీ ఆత్మవిశ్వాసంలో ఉంటుంది” అని తెలిపారు.

ఈ కథ, ఉద్యోగ మార్కెట్‌లో జరుగుతున్న అసమతుల్యతను తెలియజేయడమే కాదు.. జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories