Optical Illusion: మీ కళ్లు ఎంత షార్పో చెక్ చేసుకోండి! ఈ ఫోటోలో దాకున్న టెడ్డీ బేర్‌ను 10 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేట్!

Optical Illusion: మీ కళ్లు ఎంత షార్పో చెక్ చేసుకోండి! ఈ ఫోటోలో దాకున్న టెడ్డీ బేర్‌ను 10 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేట్!
x

Optical Illusion: మీ కళ్లు ఎంత షార్పో చెక్ చేసుకోండి! ఈ ఫోటోలో దాకున్న టెడ్డీ బేర్‌ను 10 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేట్!

Highlights

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. ఫోటోలో ఒకటి కనిపిస్తే.. మన మెదడుకు మాత్రం ఇంకోటి కనిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. ఫోటోలో ఒకటి కనిపిస్తే.. మన మెదడుకు మాత్రం ఇంకోటి కనిపిస్తుంది. తాజాగా ఒక రద్దీగా ఉన్న మార్కెట్ ఫోటో నెటిజన్లకు సవాలు విసురుతోంది. ఇందులో ఉన్న చిన్న బొమ్మను కనిపెట్టడం అంత సులభం కాదని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ దాని కథ ఏమిటంటే.. పైన ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి నిశితంగా గమనించండి. ఒక సందడి గల మార్కెట్ కనిపిస్తోంది కదా? అక్కడ పిల్లలు, పెద్దలు, ముసలివారు.. ఇలా రకరకాల మనుషులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది తమ పెంపుడు జంతువులతో కలిసి షాపింగ్ చేస్తున్నారు. కానీ, ఈ రద్దీ మధ్య ఎక్కడో ఒక చోట ఒక సాఫ్ట్ టాయ్ (టెడ్డీ బేర్‌) దాగి ఉంది. దానినే మీరు వెతకాల్సింది.

10 సెకన్లలో కనిపెట్టేయండి.. !

సాధారణంగా ఎవరైనా ఈ బొమ్మను కనిపెట్టగలరు, కానీ అసలైన మజా ఏంటంటే.. మీరు దీనిని కేవలం 10 సెకన్లలోపు గుర్తించాలి. పదునైన కంటి చూపు, గొప్ప ఏకాగ్రత ఉన్నవారు మాత్రమే ఈ ఫీట్‌ను పూర్తి చేయగలరు. మీ కౌంట్‌డౌన్ మొదలైంది.. 1.. 2.. 3.. 4.. 5.. 6.. 7.. 8.. 9.. 10! స్టాప్. టైం అయిపోయింది. మీరు ఆ బొమ్మను గుర్తించినట్లయితే.. గ్రేట్. మీ పరిశీలనా శక్తి చాలా అద్భుతంగా ఉందని అర్థం. ఒకవేళ మీరు ఇంకా వెతుకుతూనే ఉంటే, మీ కోసం ఒక చిన్న హింట్ ఇస్తున్నాను చూడండి. చిత్రంలోని మూలలను, మనుషుల చేతులను ఒకసారి జాగ్రత్తగా చూడండి.

ఇప్పటికీ దొరకలేదా? సమాధానం ఇదే..

చాలామంది ఈ బొమ్మను మనుషుల మధ్య వెతుకుతుంటారు, కానీ అది ఒక చోట చాలా స్పష్టంగా దాగి ఉంది. మేము మీ కోసం ఆ టెడ్డీ బేర్‌ను ఎరుపు రంగు సర్కిల్‌లో గుర్తించాము చూడండి. అది ఎక్కడుందో చూసి "అరె.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాను!" అని మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.





Show Full Article
Print Article
Next Story
More Stories