Optical Illusion: 10 సెకన్లలో ఈ ఫోటోలో ఉన్న 'వింత' అభిమానిని గుర్తించగలరా?

Optical Illusion: భారతదేశంలో ఇటీవల రాక్ బ్యాండ్ లింకిన్ పార్క్ సందడి నెలకొంది.

Ganesh
Published on: 16 Feb 2026 6:32 PM IST
Optical Illusion: 10 సెకన్లలో ఈ ఫోటోలో ఉన్న వింత అభిమానిని గుర్తించగలరా?
X

Optical Illusion: భారతదేశంలో ఇటీవల రాక్ బ్యాండ్ లింకిన్ పార్క్ సందడి నెలకొంది. ముంబై, బెంగళూరు నగరాల్లో జరిగిన షోలకు అభిమానులు పోటెత్తారు. వేల సంఖ్యలో ఉన్న జనం మధ్యలో ఒకే ఒక్కడు వింతగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఒక ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ పజిల్ ఏంటంటే.. పైన ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి నిశితంగా చూడండి. ఇది ఒక రాక్ బ్యాండ్ షోకి సంబంధించిన ఫోటో. ఈ షోలో వేల సంఖ్యలో అభిమానులు పాల్గొని మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతున్నారు. అయితే, అందరిలోకి ఒకే ఒక్క అభిమాని మాత్రం అందరి కంటే భిన్నంగా, కొంచెం వింతగా ఉన్నాడు. అతనెవరో మీరు కనిపెట్టాలి.

ఏ పజిల్ అయినా టైం లిమిట్ ఉంటేనే కిక్కు ఇస్తుంది. అందుకే మీరు ఆ వింత అభిమానిని కేవలం 10 సెకన్లలోపు గుర్తించాలి. చాలా షార్ప్ కంటి చూపు, గొప్ప పరిశీలన నైపుణ్యం ఉన్నవారు మాత్రమే దీన్ని త్వరగా ఛేదించగలరు. సామాన్య వ్యక్తులు దీన్ని గుర్తించడానికి కనీసం 3 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోవచ్చు. మీ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. 1... 2... 3... 4... 5... 6... 7... 8... 9... 10. మీ టైం అప్. నిజానికి చాలా మంది ఆ వింత అభిమాని ఎక్కడున్నాడా అని ఫొటో అంతా వెతుకుతుంటారు. మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్న.. అది ఏమిటంటే .. ఫోటోలోని మధ్య భాగాన్ని కాకుండా, మూలల వైపు లేదా వెనుక వైపు ఉన్న జనంలో కాస్త భిన్నంగా ఉన్న ముఖ కవళికలను గమనించండి. మళ్లీ ఒకసారి ప్రయత్నించండి.

సమాధానం ఇదే..

మీరు ఆ వింత అభిమానిని గుర్తించినట్లయితే మీకు అభినందనలు. మీ పరిశీలన శక్తి అద్భుతం. ఒకవేళ మీరు ఇంకా వెతుకుతూనే ఉంటే, చింతించకండి. మేము ఆ వింత వ్యక్తిని కింద ఉన్న ఇమేజ్‌లో ఎరుపు రంగు సర్కిల్‌తో మార్క్ చేసి చూపించాము. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు కేవలం సరదా కోసం మాత్రమే కాదు, ఇవి మీ మెదడు చురుకుదనాన్ని, ఏకాగ్రతను పెంచుతాయి.



Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story