Viral News: దేశ భ‌క్తిని చాటుకున్న జ‌వాన్‌.. పెళ్లి కార్డుపై

Viral News
x

Viral News: దేశ భ‌క్తిని చాటుకున్న జ‌వాన్‌.. పెళ్లి కార్డుపై

Highlights

Viral News: భారతదేశం ఇటీవల పాక్‌కు గట్టి బుద్ధి చెప్పిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఆప‌రేష‌న్ సిందూర్‌ను దేశ ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. కొంద‌రు ఆ స‌మ‌యంలో పుట్టిన కూతుర్ల‌కు సిందూర్ అని పేరు కూడా పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ జ‌వాన్ చేసిన ప‌ని అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రం సికర్ జిల్లాకు చెందిన అమిత్ సింగ్ అనే ఆర్మీ సైనికుడు తన పెళ్లి ఆహ్వాన పత్రికను ఆపరేషన్ సిందూర్‌కు నివాళిగా రూపొందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఈ ఆహ్వాన పత్రికలో ముద్రించిన పదాలు చాలా మంది హృదయాలను హత్తుకున్నాయి. "మా గర్వం, మా బలం – ఆపరేషన్ సిందూర్ యోధులు తమ సోదరుడి వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి" అనే మాటలు ఈ పెళ్లికి ఒక ప్రత్యేకతను ఇచ్చాయి. ఇది కేవలం పెళ్లి పత్రిక మాత్రమే కాదు, దేశ సేవ చేస్తున్న కుటుంబం గర్వాన్ని ప్రతిబింబించే ఓ దేశభక్తి సందేశంగా మారింది.

అమిత్ సింగ్ కుటుంబం ఒక వ్యవసాయ కుటుంబమే అయినా, దేశ రక్షణలో పాలు పంచుకుంటూ మిలిటరీలో ముగ్గురు కుమారులను పంపించారు. మే 28న జరగబోయే ఈ వివాహం, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం మే 7న 'ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ సమయంలో అమిత్ కుటుంబానికి చెందిన ముగ్గురు సైనికులు భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో విధులు నిర్వ‌హించడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories