
OMG : నట్టింట్లో భూమిని చీల్చుకుని బయటకు వచ్చిన గంగమ్మ.. బిలాస్‌పూర్‌లో వింత ఘటన
OMG : ప్రకృతి ప్రకోపించినా, మానవ తప్పిదాలు జరిగినా కనిపించే దృశ్యాలు ఒక్కోసారి ఊహకందని విధంగా ఉంటాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి ఒక ఒళ్లు గగుర్పొడిచే వీడియో బయటకు వచ్చింది. భూమిని చీల్చుకుంటూ ఆకాశమంత ఎత్తుకు నీరు ఎగజిమ్మిన ఈ దృశ్యం చూస్తుంటే.. ఏదో సునామీ వచ్చిందా? లేక భూకంపం వచ్చిందా? అన్నంత భయం కలుగుతోంది. ఒక ఖాళీ స్థలంలో బోర్ వేస్తుండగా జరిగిన ఈ వింత ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగిన ఒక భయంకరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జనవరి 29వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన చూస్తుంటే.. భూమి లోపల ఎంతటి ఒత్తిడి దాగి ఉంటుందో అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒక ఖాళీ ప్లాట్‌లో భారీ యంత్రాల సహాయంతో బోర్ వెల్ తవ్వే పనులు జరుగుతున్నాయి. శక్తివంతమైన యంత్రాలను ఉపయోగించి లోపలికి డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో భూగర్భంలో విపరీతమైన గాలి ఒత్తిడి ఏర్పడింది.
నిజానికి ఆ ఖాళీ ప్లాట్ పక్కనే ఒక నివాస గృహం ఉంది. ఆ ఇంట్లో ఇప్పటికే ఒక పాత బోర్ పైపు ఉంది. పక్క ప్లాట్‌లో కొత్తగా వేస్తున్న బోర్ వల్ల ఏర్పడిన భారీ ప్రెజర్‌ను ఆ పాత పైపు తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా భూమి లోపల పైపు పేలిపోవడంతో, ఆ గాలి ఒత్తిడికి నీరు భూమిని చీల్చుకుంటూ బయటకు తన్నుకొచ్చింది. మొదట గేటు లోపల నుంచి చిన్నగా నీరు రావడం వీడియోలో కనిపిస్తుంది, కానీ మరుక్షణమే పెను ప్రమాదంలా భూమి ఫాట్ మని పగిలి నీరు పైకి ఎగజిమ్మింది. సుమారు 10 సెకన్ల పాటు జరిగిన ఈ భీభత్సం చూసి అక్కడున్న వాళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు.
छत्तीसगढ़ | बिलासपुर में एक प्लॉट में हैवी मशीन से बोरिंग करने का काम हो रहा था। हाईप्रेशर बनने से पड़ोसी के मकान का बोरिंग पाइप फट गया। एकदम जमीन फट गई और पानी की धार फूट पड़ी। pic.twitter.com/ClVFNwoGh2
— Sachin Gupta (@SachinGuptaUP) January 31, 2026
ఈ వీడియోలో ఒక వ్యక్తి నీరు తన వైపు దూసుకురావడం చూసి భయంతో వెంటనే అక్కడి నుంచి పారిపోవడం కనిపిస్తుంది. నీటి వేగం ఎంత ఎక్కువగా ఉందంటే.. కొన్ని క్షణాల్లోనే ఆ వీధి మొత్తం చెరువులా మారిపోయింది. సాధారణంగా బోర్ వేసేటప్పుడు చుట్టుపక్కల పరిస్థితులపై అవగాహన ఉండాలి. మరీ దగ్గరలో పాత బోర్ వేసినా లేదా నీటి పైపులైన్లు ఉన్నా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఇలాంటి పనులు చేసేటప్పుడు భద్రతా నియమాలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఈ వీడియో హెచ్చరిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




