ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. హెలికాప్టర్ ప్రమదాల్లో ఎలా మరణించారు?

Now President of Iran Ibrahim Raisi, Then YS Rajasekhara Reddy How did They die in Helicopter Accidents
x

ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. హెలికాప్టర్ ప్రమదాల్లో ఎలా మరణించారు?

Highlights

Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తొలుత ఏటీసీతో సంబంధాలు తెగిపోయిన రైసీ హెలికాప్టర్ కోసం రెస్క్యూటీమ్ గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఒక రోజు తర్వాత రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.ఈ ప్రమాదంలో రైసీ మరికొందరు మృతి చెందారు.ప్రతికూల వాతావరణం కారణంగానే రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం గుర్తుకు వస్తుంది.

2009లో ఏం జరిగింది?

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు రచ్చబండ కార్యక్రమం ప్రారంభించాలని భావించారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ లో హైద్రాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి చిత్తూరు జిల్లాకు బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. సీఎం ప్రయాణీస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్ కావడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. రక్షణ శాఖకు చెందిన ఆధునాతన విమానాలు, హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. నల్లమల అడవుల్లోని పావురాలగుట్ట వద్ద వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సహా వ్యక్తిగత సిబ్బంది మృత్యువాతపడ్డారు.



వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇబ్రహీం రైసీ ఉపయోగించింది బెల్ హెలికాప్టర్లే

మే 19వ తేదీన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దు నుండి తబ్రిజ్ పట్టణానికి బెల్ 212 హెలికాప్టర్ లో బయలుదేరారు. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే ఈ హెలికాప్టర్ కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారులు అధ్యక్షుడి హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, మే 20న ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ను రెస్క్యూటీమ్ గుర్తించింది. 2009లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రయాణించింది బెల్ 430 హెలికాప్టర్.ఈ హెలికాప్టర్లను తయారు చేసింది అమెరికాకు చెందిన బెల్ టెక్స్ ట్రాన్ కంపెనీ తయారు చేసింది. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడ ప్రతికూల వాతావరణం కారణంగా నల్లమల అడవుల్లో కూలిపోయింది.ఒక్క రోజు తర్వాత ఈ విషయాన్ని ఆర్మీ హెలికాప్టర్ గుర్తించింది.

ఈ రెండు ప్రమాదాలను ఒకే రకంగా కన్పిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో ఈ రెండు హెలికాప్టర్లు కూలిపోయాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత హెలికాప్టర్లు కుప్పకూలిపోయాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories