Penguin Story: ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఒంటరి ప్రయాణం

Penguin Story: ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఒంటరి ప్రయాణం
x

Penguin Story: ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న ఒంటరి ప్రయాణం

Highlights

Penguin Story: వెర్నర్ హెర్జోగ్ డాక్యుమెంటరీలోని ఒంటరి పెంగ్విన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆధునిక జీవిత ఒత్తిడికి ప్రతీకగా నిలుస్తోంది.

Penguin Story: ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ఓ పెంగ్విన్ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఒంటరిగా తన దారిలో తాను నడుస్తూ వెళ్లే ఈ పెంగ్విన్‌ను నెటిజన్లు ప్రేమతో “నిహిలిస్ట్ పెంగ్విన్”గా పిలుస్తున్నారు. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లు, ఆందోళనల నుంచి దూరంగా ప్రశాంతమైన జీవితం కోరుకునే భావనకు ఇది ప్రతీకగా మారింది.

ఈ వైరల్ వీడియో ప్రఖ్యాత జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ తెరకెక్కించిన Encounters at the End of the World అనే డాక్యుమెంటరీ నుంచి తీసుకున్నది. 2007లో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో అంటార్కిటికాలోని మంచు ప్రపంచం, అక్కడి శాస్త్రవేత్తలు, జంతువుల జీవన విధానాన్ని చూపించారు. షూటింగ్ సమయంలో, ఆహారం కోసం సముద్రం వైపు పరుగెత్తిన పెంగ్విన్‌ల గుంపులోంచి ఒక్క అడిలీ పెంగ్విన్ మాత్రం ఒంటరిగా దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతం వైపు నడవడం కనిపించింది.

ఆ పెంగ్విన్‌ దారిని గమనించిన వెర్నర్ హెర్జోగ్ దానిని “డెత్ మార్చ్”గా అభివర్ణించారు. ఎందుకంటే ఆ దారిలో ఆహారం లేకపోవడం, తీవ్రమైన చలి కారణంగా ప్రాణహాని ఉండే అవకాశం ఉంది. అందుకే ఆ పెంగ్విన్‌ను తిరిగి గుంపులో కలిపినట్లు డాక్యుమెంటరీలో చూపించారు.

అయితే ఈ వీడియో ఇప్పుడు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మళ్లీ వైరల్ అయింది. ముఖ్యంగా ‘L’amour Toujours’ పాటను జోడించిన వెర్షన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. నెమ్మదిగా సాగే సంగీతం, ఒంటరిగా నడిచే పెంగ్విన్ దృశ్యం కలిసి భావోద్వేగాలను రేకెత్తిస్తోంది.

నేటి వేగవంతమైన జీవితంలో, పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, సంబంధాల సంక్లిష్టతల మధ్య “అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలనే” భావన చాలామందిలో ఉంటుంది. ఆ భావనను ఈ పెంగ్విన్ ఒక్క మాట లేకుండా ప్రతిబింబిస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. అందుకే ఈ ఒంటరి ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆకట్టుకుంటూ, నిహిలిస్ట్ పెంగ్విన్‌గా సోషల్ మీడియా సంచలనంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories