Science News: నాసాకి చిక్కిన అరుదైన గ్రహం.. భూమి కంటే ఐదు రెట్లు పెద్దది!

Nasa Discovers Two Planets Bigger Than Earth Diamonds
x

Science News: నాసాకి చిక్కిన అరుదైన గ్రహం.. భూమి కంటే ఐదు రెట్లు పెద్దది!

Highlights

ఆ గ్రహం ఉపరితలం వజ్రాలు, గ్రాఫైట్‌తో నిండి ఉందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక వజ్రపు భూమి!

Nasa Discovers Two Planets Bigger Than Earth Diamonds

Science News: అందం, అద్భుతం, విభిన్నత, విస్మయం.. ఇవన్నీ కలిసే ఒక అపూర్వ ప్రదేశం..మన విశ్వం..! అకాశమంతా ప్రకాశించే నక్షత్రాల మధ్య సైంటిస్టులకు ఊహించని అద్భుత దృశ్యం కనిపించింది. భూమికి 41 కాంతి సంవత్సరాల దూరంలో రెండు ప్రత్యేకమైన గ్రహాలు దర్శనమిచ్చాయి. అందులో ఒకటి వజ్రాలతో నిండి ఉన్న గ్రహం. దాన్ని 55-క్యాన్‌క్రి అని పిలుస్తున్నారు. ఇంకోటి కూడా వజ్రాలతోనే నిండి ఉంది. దీన్ని PSR J1719 అని పిలుస్తున్నారు.

ఇందులో 55-క్యాన్‌క్రి గ్రహం భూమికంటే రెండింతలు పెద్దది. బరువులో తొమ్మిది రెట్లు ఎక్కువ. ఈ గ్రహంలోని వాతావరణం భయంకరంగా ఉందట. ఏకంగా 2,400 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఈ గ్రహంలో ఉంని నాసా చెబుతోంది. విస్ఫోటన శక్తితో ఎగసిపడే లావా సముద్రాలు కూడా ఈ గ్రహంలో ఉన్నాయట. ఈ గ్రహం ఉపరితలం సాధారణ రాళ్లతో కప్పి లేదు. దీని ఉపరితలం వజ్రాలు, గ్రాఫైట్‌తో నిండి ఉందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక వజ్రపు భూమి!

అటు NASA శాస్త్రవేత్తలు PSR J1719 అనే మరో అద్భుతమైన గ్రహాన్ని గుర్తించారు. PSR J1719 నిజానికి ఒకప్పుడు ఒక నక్షత్రంగా ఉండేది. అయితే దాని సమీపంలోని న్యూట్రాన్ తార PSR బాహ్య పొరను పూర్తిగా తొలగించింది. దీని కారణంగా నక్షత్రం కాస్త గ్రహంగా మారిపోయింది. ఈ PSR గ్రహం భూమి కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. పూర్తిగా ఒక మహా వజ్రపు బంతిలా కనిపిస్తుంది. ఇలా మనకు తెలియని నక్షత్రాల కథలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు!

Show Full Article
Print Article
Next Story
More Stories