ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ సెల్ఫ్ గోల్

ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ సెల్ఫ్ గోల్
x
Highlights

ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ముకేశ్ కుమార్ తప్పుడు కులధృవీకరణ పత్రం సమర్పించడం ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. భారత విమానయాన సంస్థలో...

ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ముకేశ్ కుమార్ తప్పుడు కులధృవీకరణ పత్రం సమర్పించడం ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. భారత విమానయాన సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న ముకేశ్...ఉద్యోగం నుంచి పదోన్నతి వరకూ...తప్పుడు కులధృవీకరణ పత్రం సమర్పించి అనుచిత లబ్ది పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భారత ప్రభుత్వం నుంచి గతంలోనే అర్జున పురస్కారం అందుకొన్న ముకేశ్...సికింద్రాబాద్ తహసిల్దార్ నుంచి ఎస్ సి మాల పేరుతో కులధృవీకరణ పత్రాన్ని పొందినట్లు, ఫోర్జరీ పత్రాలను ఉపయోగించినట్లు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో జనవరి 25నే కేసు నమోదయ్యింది. ముకేశ్ సోదరుడు సురేశ్ కుమార్ పైన సైతం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2007 నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ విజిలెన్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ముకేశ్ కుమార్...బీసీ-ఏ లోని నాయి బ్రాహ్మణ కులానికి చెందినవాడని...అయితే ఫోర్జరీ పత్రాలతో తన కులాన్ని ఎస్ సీ మాలగా మార్చుకొని మోసం చేశారంటూ గతంలోనే ఆరోపణలు రావడంతో విచారణకు కలెక్టర్ ఆదేశించారు. అంతర్గత విచారణలో ముకేశ్ కులం బీసీ అని తేలిందని...అయితే ఫోర్జరీ పత్రాలతో ఎస్ సీ మాల కులధృవీకరణ పత్రం పొంది అనుచిత లబ్ది పొందారని...పైగా మోసం, దగా చేశారంటూ కేసులో తేలిందని అధికారులు తెలిపారు. భారత్ తరపున 307 అంతర్జాతీయ హాకీ మ్యాచ్ ల్లో పాల్గొన్న ముకేశ్ కు 80 గోల్స్ సాధించిన రికార్డు ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories