'మాతృదేవోభవ' సూక్తికి నిజమైన తెర రూపం!

మాతృదేవోభవ సూక్తికి నిజమైన తెర రూపం!
x
Highlights

అమ్మ... ఈ పిలుపులో ఎంతో మాధుర్యం.. ఎంతో మమకారం... ఎంతో తియ్యదనం...అందుకే భగవంతుడు సైతం అమ్మనే కావాలి అనుకున్నాడు.

అమ్మ... ఈ పిలుపులో ఎంతో మాధుర్యం.. ఎంతో మమకారం... ఎంతో తియ్యదనం...అందుకే భగవంతుడు సైతం అమ్మనే కావాలి అనుకున్నాడు. అందుకే అమ్మ అంటే అంత గొప్పది. అమ్మ గురించి ఎంతోమంది కవులు,ఎంతోమంది రచయితలు చాలా విధాలుగా వర్ణించారు. కానీ అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే..!వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. మనల్ని మనలా ప్రేమించేది కేవలం ఒక్క అమ్మ మాత్రమే. చివరికి ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా.. నిన్ను ప్రేమించే వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే..

అమ్మ గొప్పతనం గురించి చెప్పే సినిమాలు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే వచ్చాయి.. అందులో ఒకటి మాతృవేదోభవ.. ప్రతి ఒక్కరినీ కదిలించి ఓ క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రం.. విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యానార్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన నలుగురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా...అమ్మ ప్రేమకి అసలైన అర్ధం చెప్పింది ఈ సినిమా..1993 లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.. నాజర్, మాధవి ల నటన సినిమాకి ప్రాణం పోసింది.. అనాథాశ్రమంలో పెరిగున శారద(మాధవి) ,సత్యం(నాజర్)లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.వీరికి నలుగురు సంతానం కలుగుతారు.

విధివశాత్తూ భర్తను కోల్పోయిన శారద తన లాగా తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది. చివరికి తాను చనిపోతుంది. దత్తత ఆయితే ఇచ్చింది కానీ ఆ తరవాత తన పిల్లల కోసం పడే తాపత్రయం కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు.. అంతేకాకుండా ఆ నలుగురు అక్క,తమ్ముడు,అన్నయ్య ఒకరిని ఒకరు విడిచి ఉండేలేకా పడే బాధ ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి సన్నివేశం అందరిని ప్రేక్షకుడి హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఎప్పటికి ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది.

''అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు''.. మనల్ని కంటిపాపలా కాపాడే అమ్మకి 'మదర్స్ డే' శుభాకాంక్షలు.. తెలుపుతుంది హెచ్ఎంటీవీ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories