Railway Station: ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం.. మన దేశంలోనే ఎక్కడుందో తెలుసా?

Mizoram is only one Railway Station in this Entire State Its Name is Bairabi Railway Station
x

Railway Station: ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రం.. మన దేశంలోనే ఎక్కడుందో తెలుసా?

Highlights

Indian Railways Interesting Facts: భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిదిన్నర వేల రైల్వే స్టేషన్‌లను కలిగి ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలు తమ గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. అయితే, మనదేశంలో ఒకే ఒక్క స్టేషన్ ఉన్న రాష్ట్రం ఉందని, ఆ తర్వాత ట్రాక్ ముగుస్తుందని మీకు తెలుసా?

Indian Railways Interesting Facts: భారతీయ రైల్వేలు నెట్‌వర్క్ పరంగా ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉన్నాయి. భారతీయ రైల్వేలో రోజుకు 40 మిలియన్ల మంది ప్రయాణిస్తున్నారు. రైల్వే నెట్‌వర్క్ జమ్మూ అండ్ కాశ్మీర్‌తో సహా దేశంలోని ప్రతి రాష్ట్రానికి చేరుకుంది. అనేక జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒకే రైల్వే స్టేషన్ ఉన్న ఒక రాష్ట్రం మనదేశంలో ఉంది. ట్రాక్ ఈ స్టేషన్ ముందు ముగుస్తుంది. దీంతో ప్రజలు రోడ్డు మార్గంలో మరింత ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్..

ఈ రాష్ట్రం ఈశాన్య భారతదేశంలో ఉన్న మిజోరాం. ఈ మొత్తం రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉంది. దాని పేరు 'బైరాబీ రైల్వే స్టేషన్'. ఈ స్టేషన్ ద్వారా, మిజోరాం రైలు కనెక్టివిటీ ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది. రాష్ట్ర ప్రజలు ప్రయాణం, సరుకు రవాణా కోసం ఈ స్టేషన్‌కు చేరుకుంటారు. రైల్వే ట్రాక్ ఈ స్టేషన్ ముందు ముగుస్తుంది. అందుకే సాధారణంగా ఈ స్టేషన్‌ను రాష్ట్రంలోని చివరి రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తుంటారు.

స్టేషన్‌లో నాలుగు ట్రాక్‌లు, మూడు ప్లాట్‌ఫారమ్‌లు..

'బైరాబీ రైల్వే స్టేషన్' కోడ్ BHRB. ఈ స్టేషన్‌లో 4 రైల్వే ట్రాక్‌లు, 3 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఏకైక రైల్వేస్టేషన్ అయినప్పటికీ ప్రస్తుతం ఆధునిక సౌకర్యాల కొరత నెలకొంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బైరాబీ మొదట్లో చిన్న రైల్వే స్టేషన్‌గా ఉండేది. తరువాత 2016 సంవత్సరంలో ఇది తిరిగి అభివృద్ధి చేశారు. దీంతో పాటు అక్కడ అనేక సౌకర్యాలను కూడా పెంచారు.

రెండో స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం..

మిజోరం దట్టమైన అడవులు, కొండలతో కూడిన రాష్ట్రం, దీని కారణంగా అక్కడ ట్రాక్‌లు వేయడంలో అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా తన ఉనికిని పెంచుకునేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మరో రైల్వే స్టేషన్‌కు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీంతో పాటు ట్రాక్‌ల విస్తరణకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరుగుతోంది. రానున్న కాలంలో అక్కడ కూడా రైలు నెట్‌వర్క్‌ను విస్తరించడం పెద్ కష్టమేమీ కాకపోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories