logo

చిన్నారి ప్రాణం తీసిన అగ్గిపెట్టె!

చిన్నారి ప్రాణం తీసిన అగ్గిపెట్టె!

చిన్నారులను జాగ్రత్తగా గమనించకపోతే ప్రమాదమే! ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాంతకంగా మారుతుంది. ఉక్రెయిన్ లో ఇటువంటిదే ఓ సంఘటన పసిపాప ప్రాణాన్ని తీసింది. అగ్గిపెట్టెతో ఆడుకుంటూ కారుకు మంటలు అంటుకోవడంతో సజీవ దహనం అయిపోయింది. ఫోరెన్సిక్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒరైనా అనే రెండేళ్ల పాప ఇంటి బయట ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంటి ప్రాంగణంలో ఉన్న కారును ఎక్కడానికి ప్రయత్నించింది. కారు డోరు సరిగ్గా వేయకపోవడంతో పాప కారెక్కి ఆడుకోవడం మొదలుపెట్టింది. అలా కారులో ఉన్న అగ్గిపెట్టెలను చూసి ఓ అగ్గిపుల్లను వెలిగించి పక్క సీటుపై పడేయడంతో సీటు ఒక్కసారిగా తగలబడింది. నెమ్మదిగా కారు మొత్తం మంటలు వ్యాపించడంతో రెండేళ్ల చిన్నారి మంటల్లో కాలిపోయింది. ఇంటి కిటికీలో నుంచి బయటకు చూసిన తండ్రికి పెరట్లో పాప కనిపించకపోవడంతో ఆందోళన చెంది బయటకు వచ్చాడు. కారులో మంటలను చూసి ఒక్కసారిగా ఆందోళన చెందాడు. కారులో తన పాపను చూసి వెంటనే బయటకు లాగి ఇంట్లోకి తీసుకెళ్లాడు. పాప తల్లి అరుపులకు స్థానికులు అక్కడకు చేరుకుని వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. దాదాపు శరీరం మొత్తం కాలిపోవడంతో వైద్యులు వచ్చే సరికే పాప ప్రాణాలను కోల్పోయింది.

లైవ్ టీవి

Share it
Top