Viral News: ‘పెళ్లి ఎమర్జెన్సీ కాదు’ అన్న బాస్‌… నిశ్చితార్థానికి ముందు ఉద్యోగిపై ఒత్తిడి

Viral News: ‘పెళ్లి ఎమర్జెన్సీ కాదు’ అన్న బాస్‌… నిశ్చితార్థానికి ముందు ఉద్యోగిపై ఒత్తిడి
x

Viral News: ‘పెళ్లి ఎమర్జెన్సీ కాదు’ అన్న బాస్‌… నిశ్చితార్థానికి ముందు ఉద్యోగిపై ఒత్తిడి

Highlights

Viral News: నిశ్చితార్థానికి ముందు సెలవులు కోరిన ఉద్యోగికి “పెళ్లి ఎమర్జెన్సీ కాదు” అంటూ మేనేజర్ వ్యాఖ్యలు. వైరల్ అవుతున్న కార్పొరేట్ ఒత్తిడి ఘటన.

Viral News: ఉద్యోగ ఒత్తిడి, మానవీయతలేని కార్పొరేట్ సంస్కృతి మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిశ్చితార్థానికి ముందు సెలవులు కోరిన ఓ ఉద్యోగికి, “పెళ్లి ఎమర్జెన్సీ కాదు” అంటూ మేనేజ్‌మెంట్ స్పందించిందన్న ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

రెడ్డిట్‌లో వైరల్ అయిన ఓ పోస్టులో, సదరు ఉద్యోగి తన అనుభవాన్ని వివరించాడు. రెండు నెలల ముందే తన నిశ్చితార్థం, వివాహ ప్రణాళికల గురించి అధికారులకు తెలియజేశానని, అయినా సరైన ప్రణాళిక లేకుండా చివరి నిమిషంలో ‘నైట్‌మేర్ ప్రాజెక్ట్’ అప్పగించారని తెలిపాడు. సెలవుల దరఖాస్తులు ఇప్పటికీ ఆమోదం పొందలేదని పేర్కొన్నాడు.

ఆఫీస్‌లో ప్రతి పని అత్యవసరమని చెబుతారని, కానీ సమన్వయం లేకపోవడం, అనుభవం లేని మేనేజర్ల మైక్రో మేనేజ్‌మెంట్ వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని వాపోయాడు. అంతేకాదు, 120 కిలోమీటర్లకు మించి పని చేయకుండా జియో-ఫెన్సింగ్ నిబంధనలు కూడా అమలు చేస్తున్నారని వెల్లడించాడు.

ఈ ఘటనపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “కంపెనీ పేరును బయటపెట్టి మమ్మల్ని కాపాడండి” అంటూ కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఇది విషపూరిత కార్పొరేట్ వాతావరణానికి నిదర్శనమని, ఉద్యోగులు తమ హద్దులను స్పష్టంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.



Show Full Article
Print Article
Next Story
More Stories