లగేజీ చార్జీలు తగ్గించాలని.. 15 చొక్కలేసుకున్నాడు!

లగేజీ చార్జీలు తగ్గించాలని.. 15 చొక్కలేసుకున్నాడు!
x
Highlights

ఏనుగులు పోయే దారులున్నా ఫర్వాలేదు కానీ.. ఎలుక కన్నాలు మూసేయాలని చూసాడట వెనుకకి ఒకడు. అలంటి వాడే ఇతనూను. ఇతని పేరు జాన్‌ ఇర్విన్‌. దేశం స్కాట్లాండ్‌....

ఏనుగులు పోయే దారులున్నా ఫర్వాలేదు కానీ.. ఎలుక కన్నాలు మూసేయాలని చూసాడట వెనుకకి ఒకడు. అలంటి వాడే ఇతనూను. ఇతని పేరు జాన్‌ ఇర్విన్‌. దేశం స్కాట్లాండ్‌. ఈయన గారు వేరే ఊరు వెళ్లాలని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాడు. కూడా పెద్ద సూట్ కేసూ ఉంది. అయితే అందులో ఉన్న బట్టల బరువుకు లగేజీ కట్టమని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కోరారు. అవి నా బట్టలే. అక్కడ వేసుకోవడానికి కావాలి కదా అని వాళ్ళతో వాదించాడు. ఆ అధికారులు లగేజీకి సొమ్ము చెల్లించాల్సిందే అన్నారు.

అంతే.. మనోడికి వెంటనే ఓ ఐడియా వచ్చింది. సూట్ కేస్ లో ఉంటె కదా లగేజీ.. మరి ఒంటి మీద ఉంటె? ఇంతోటి దానికి లగేజీ డబ్బులు ఎందుకు కట్టడం? అనుకున్నాడు. పక్కకి వెళ్ళాడు.. సూట్ కేస్ తీసి ఒకదాని మీద ఒక్కటి 15 షర్టులు వేసుకున్నాడు. అప్పుడు అక్కడ వాతావరణం మహా వేడిగా ఉంది ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదైంది. అయినా సరే.. చొక్కా మీద చొక్కా.. చొక్కా మీద చొక్కా ఇలా పదిహేను చొక్కాలు వేసుకుని చక్కగా లోపలి పోయాడు. ఆగండి ఇంతటితో అయిపోలేదు. ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి ఈయన వాలకం చూసి అనుమానం వచ్చింది. అంత లావుగా ఉన్న చొక్కా వైపు చూసి షర్ట్ లోపల ఎదో దాచుకుని పోతున్నాడని సందేహం కలిగింది. ఇంకేముంది అబ్బాయ్ చొక్కా విప్పు అన్నారు. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదు విషయం.

ద్రౌపది వస్త్రాపహరణం సీనులా.. వరుసగా చొక్కాలు విప్పుతున్న అయ్యగార్ని చూసి వాళ్లకు నవ్వాగలేదు. ఈడియట్ అని తిట్టుకున్నారు. కేవలం లగేజీ డబ్బు మిగుల్చుకునేందుకు అతను అలా చేశాడని తెలుసుకుని వారు కూడా నవ్వుకున్నారట. ఈ విషయాన్ని వీడియో తీసిన ఇర్విన్ పుత్రుడు దానిని సోషల్ మీడియాలో ఉంచాడు. దాంతో ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పడు ట్రెండీ గా చక్కర్లు కొడుతోంది నేట్టింట్లో ఈ వీడియో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories