కుక్కకాటుకు చెప్పుదెబ్బ అంటే ఇదే : వీడియో వైరల్

కుక్కకాటుకు చెప్పుదెబ్బ అంటే ఇదే : వీడియో వైరల్
x
Highlights

నం మన ఇంట్లో ప్రశాంతంగా ఉందామన్నా ఉండనీయరు కొంతమంది. పక్క వాళ్లకు ఇబ్బంది కలుగుతుందని ఏ మాత్రం సంకోచించారు. మా స్థానంలో మా ఇష్టం అన్నట్టు...

నం మన ఇంట్లో ప్రశాంతంగా ఉందామన్నా ఉండనీయరు కొంతమంది. పక్క వాళ్లకు ఇబ్బంది కలుగుతుందని ఏ మాత్రం సంకోచించారు. మా స్థానంలో మా ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తారు. ఎవరెలా పోతే మాకేంటి? అన్నట్టుంటారు. అటువంటి వారికి బుద్ధి వచ్చేలా చేసిన వైనం ఇది. ఒక్క ఐడియాతో తమకు నిద్ర లేకుండా చేస్తున్న వాళ్లని తరిమి కొట్టాడు ఓ వ్యక్తి. ఆ వివరాలివిగో..

చిన్న, పెద్ద ఫంక్షన్ ఏదైనా డీజేల హోరు తప్పనిసరి. ఇప్పుడు అది కూడా స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. డీజే లేకుంటే పార్టీకి మజా ఎక్కడి నుంచి వస్తుందన్న వారూ ఉన్నారు. అమెరికాలోని ఆస్టిన్‌లోనూ ఓ వ్యక్తి ఇలానే డీజే పెట్టి పెద్ద సౌండ్‌తో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. మ్యూజిక్ హోరు భరించలేనంతగా మారడంతో పక్కింటి వ్యక్తి వెళ్లి సౌండ్ తగ్గించమని కోరాడు. అయినా తగ్గించలేదు సరికదా.. మరింత పెంచాడు. దీంతో మరోమారు వెళ్లి సౌండ్ తగ్గించమని కోరాడు. అయినా అతడిలో మార్పు రాలేదు సరికదా.. ఏం చేసుకుంటావో చేసుకోవాలంటూ తలబిరుసు సమాధానం ఇచ్చాడు.

దీంతో ఇక అతడికి చెప్పి లాభం లేదని భావించిన బాధితుడు.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తానే వారి పనిపట్టాలని నిర్ణయించాడు. తన వద్ద ఉన్న డ్రోన్‌కు బాణసంచా కట్టాడు. దాన్నిండా దీపావళి బాంబులు, రాకెట్లు అమర్చాడు. ఆ తర్వాత వాటితో పక్కింటి పార్టీపై ప్రయోగించాడు. అంతే.. ఆకాశం నుంచి డ్రోన్ బాంబులు ప్రయోగిస్తుంటే పార్టీ కకావికలం అయింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని యువకులు పరుగులు తీశారు. డ్రోన్ వారిని వెంటాడుతూ బాంబులు ప్రయోగిస్తుంటే భయంతో బిక్కచచ్చిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆ వీడియో మీరూ చూసేయండి...Show Full Article
Print Article
More On
Next Story
More Stories