Viral Video : వీడు మామూలోడు కాదు..ఐఫోన్ కోసం షార్క్‌లకే చుక్కలు చూపించాడు

Viral Video : వీడు మామూలోడు కాదు..ఐఫోన్ కోసం షార్క్‌లకే చుక్కలు చూపించాడు
x

Viral Video : వీడు మామూలోడు కాదు..ఐఫోన్ కోసం షార్క్‌లకే చుక్కలు చూపించాడు

Highlights

సోషల్ మీడియా పిచ్చి, స్మార్ట్‌ఫోన్ల మీద వ్యామోహం మనుషులతో ఎలాంటి పనులు చేయిస్తాయో చెప్పడానికి ఈ వైరల్ వీడియో ఒక నిదర్శనం.

Viral Video : సోషల్ మీడియా పిచ్చి, స్మార్ట్‌ఫోన్ల మీద వ్యామోహం మనుషులతో ఎలాంటి పనులు చేయిస్తాయో చెప్పడానికి ఈ వైరల్ వీడియో ఒక నిదర్శనం. ప్రాణం కంటే ఫోన్ ముఖ్యం అనుకున్నాడో ఏమో గానీ.. ఒక వ్యక్తి చేసిన సాహసం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడచాల్సిందే. ఏకంగా మనుషులను వేటాడే షార్క్‌లు గుంపులు గుంపులుగా తిరుగుతున్న నీళ్లలోకి ఆ వ్యక్తి దూకేశాడు. కేవలం తన ఐఫోన్ కోసం అతను చేసిన ఈ పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ భయంకరమైన దృశ్యం సముద్ర తీరంలో పర్యాటకులు తిరిగే ఒక చెక్క వంతెన దగ్గర జరిగింది. అక్కడ సముద్రపు నీటిలో పదుల సంఖ్యలో షార్క్‌లు తిరుగుతున్నాయి. పర్యాటకులు వంతెన మీద నిలబడి ఆ షార్క్‌లను చూస్తూ, వాటికి ఆహారాన్ని వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, అక్కడే ఉన్న ఒక వ్యక్తి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ అనుకోకుండా నీళ్లలోకి జారి పడిపోయింది. సరిగ్గా ఎక్కడైతే షార్క్‌లు గుంపులుగా ఉన్నాయో అక్కడే ఫోన్ పడింది. సాధారణంగా ఎవరైనా సరే.. అంత దూరం నుండి ఫోన్ పడితే అది పోయిందని వదిలేసుకుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అలా చేయలేదు.

ఫోన్ పడటమే ఆలస్యం.. చుట్టూ ఉన్న వాళ్ళు వారిస్తున్నా వినకుండా ఆ వ్యక్తి వంతెన మీద నుంచి కింద ఉన్న షార్క్‌ల మధ్యలోకి దూకేశాడు. నీళ్లలోకి వెళ్ళాక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లోపలికి మునిగి, ఇదుకుంటూ వెళ్లి తన మొబైల్ ఫోన్‌ను పట్టుకుని తిరిగి వంతెన పైకి వచ్చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను నీళ్లలో ఉన్నంత సేపు ఆ షార్క్‌లు అతనికి ఎలాంటి హాని చేయలేదు. బహుశా ఆ సమయంలో అవి ఆహారం కోసం వెతకకపోవడం లేదా అతన్ని చూసి భయపడటం జరిగి ఉండవచ్చు. కానీ, ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.



ట్విట్టర్లో @AmazingSights అనే అకౌంట్ ద్వారా ఈ వీడియో బయటకు వచ్చింది. "ఇది ఉప్పు నీటి సముద్రం.. ఇక్కడ షార్క్‌లు ఎప్పుడూ వేట కోసం సిద్ధంగా ఉంటాయి. కానీ ఈ వ్యక్తికి తన ఐఫోన్ తన ప్రాణం కంటే ఎక్కువ అనిపించినట్టుంది" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. కేవలం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇది ధైర్యం కాదు.. ముమ్మాటికీ పిచ్చితనం" అని ఒకరు కామెంట్ చేయగా, "ఫోన్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం చాలా తప్పు" అని మరొకరు హితవు పలికారు.

మొబైల్ ఫోన్ల కోసం ఇలాంటి సాహసాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా సెల్ఫీల కోసం, ఫోన్ల కోసం రైల్వే ట్రాక్‌ల మీదకు వెళ్లడం, కొండల పై నుంచి దూకడం వంటి ఘటనలు మనం చూశాం. కానీ షార్క్‌లు ఉన్న నీళ్లలోకి దూకడం మాత్రం పీక్ అని చెప్పాలి. టెక్నాలజీ మనిషికి సౌకర్యాన్ని ఇవ్వాలి కానీ.. ఇలా ప్రాణాల మీదకు తీసుకురాకూడదని ఈ వీడియో మనకు హెచ్చరిక జారీ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories