
Viral Video: విమానం టేకాఫ్ చూద్దామని వెళ్తే ఊహించని సంఘటన.. వైరల్ వీడియో
Viral Video: విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యే దృశ్యాన్ని చూడాలని చాలా మంది ఆశపడుతుంటారు.
Viral Video: విమానాలు టేకాఫ్, ల్యాండ్ అయ్యే దృశ్యాన్ని చూడాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఎన్ని సార్లు విమానం ఎక్కినా ఈ క్షణాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ దృశ్యాలను బహిరంగంగా, అత్యంత సమీపం నుండి చూసే అవకాశం మాత్రం చాలా అరుదుగా లభిస్తుంది. కానీ కొన్నిచోట్ల విమానాశ్రయాల రన్‌వేలకు అతి సమీపంలోనే ప్రజలు ఉండే ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా దగ్గర నుంచి వీక్షించే అనుభూతి ఓ విశేషమైనది.
అటువంటి అరుదైన ప్రదేశాల్లో సింట్ మార్టెన్ (Sint Maarten) దేశంలోని మహో బీచ్ (Maho Beach) ఒకటి. ఇది కరేబియన్ ద్వీపసమూహం దక్షిణ భాగంలో ఉన్న చిన్న దేశంలో ఉంది. ఈ బీచ్‌కు వెళ్లేవారికి విమానాలు కేవలం మీటర్ల దూరంలో టేకాఫ్ అవుతుండడం చూస్తే ఆశ్చర్యమే కాదు, కొంత భయం కూడా కలుగుతుంది! విమానాశ్రయానికి కేవలం 50 మీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ పర్యాటకులకు సాహసాత్మక అనుభూతిని అందిస్తుంది.
ప్రిన్సెస్ జూలియానా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చెందిన రన్‌వే ఇక్కడి బీచ్‌కి చాలా దగ్గరగా ఉంది. విమానం బీచ్ పైన కేవలం 20 అడుగుల ఎత్తులో పయనిస్తూ వెళ్లడం చూస్తే అదో రాకెట్ లాంచ్ అవుతున్నట్టే ఉంటుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోల్లో MD-80 సిరీస్‌కు చెందిన ఓ భారీ జెట్ టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఎయిర్‌పోర్ట్ కంచె పక్కన అనేక మంది పర్యాటకులు గుమిగూడినట్టు కనిపించారు.
విమానం ఇంజిన్లు స్టార్ట్ చేసిన క్షణంలోనే, గాలి గట్టిగా వీచటం ప్రారంభమై, పర్యాటకులపై తీవ్ర ప్రభావం పడింది.. ఆ గాలి దెబ్బకు కొంతమంది నేరుగా సముద్రంలోకి కొట్టుకుపోయారు. మరికొంతమంది నేలపై పడిపోయారు. ఇదంతా వీడియో తీయగా నెట్టింట వైరల్ అవుతోంది. సరదాకోసం ఇంత సాహసం అవసరమా అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Insane jet blast at St. Martin Airport: a tourists get blown away by MD80 aircraft taking off. pic.twitter.com/7Q6AjQoC7k
— Out of Context Human Race (@NoContextHumans) May 11, 2025

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




