Lucknow house owner : బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చిన ఇంటి యజమాని – యువతిపై అత్యాచార యత్నం

Lucknow house owner : బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చిన ఇంటి యజమాని – యువతిపై అత్యాచార యత్నం
x

Lucknow house owner : బాత్రూంలో సీక్రెట్ కెమెరా అమర్చిన ఇంటి యజమాని – యువతిపై అత్యాచార యత్నం

Highlights

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక యువతిపై ఇంటి యజమాని అమానుషానికి ఒడిగట్టిన ఘటన కలకలం రేపుతోంది. బహ్రైచ్‌కు చెందిన ఈ యువతి లక్నోలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే, జూన్ 24న ఆమె బాత్రూంలో రహస్య కెమెరా ఉండటాన్ని గమనించి షాక్‌కు గురైంది.

Lucknow house owner : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక యువతిపై ఇంటి యజమాని అమానుషానికి ఒడిగట్టిన ఘటన కలకలం రేపుతోంది. బహ్రైచ్‌కు చెందిన ఈ యువతి లక్నోలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే, జూన్ 24న ఆమె బాత్రూంలో రహస్య కెమెరా ఉండటాన్ని గమనించి షాక్‌కు గురైంది.

పరిశీలించగా, ఆ కెమెరా వైఫైకి కనెక్ట్ అయ్యి లైవ్‌లో స్ట్రీమింగ్ చేస్తోందని తెలుసుకుంది. వెంటనే దాన్ని తొలగించగా, ఇంటి యజమాని అక్కడికి వచ్చి మొదట తన తప్పును అంగీకరించి క్షమించమని వేడుకున్నాడు. కానీ, బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పగానే అతడి అసలైన రూపం బయటపడింది.

ఆమెపై అత్యాచారానికి యత్నించడమే కాకుండా, ఈ విషయం బయటపెడితే తల్లిని చంపేస్తానని, సోదరిపై అత్యాచారం చేస్తానని బెదిరించాడు. బాధితురాలు గదిలోకి వెళ్లి తాళం వేసుకుని బయటపడ్డ ఆమె, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దుబగ్గా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై స్పందించిన ఇన్‌స్పెక్టర్ అభినవ్ వర్మ, పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందనీ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories