ఓ మహిళ క్రూరత్వం.. చిన్నారిని అమానుషంగా..: స్పందించిన లతా రజనీకాంత్

ఓ మహిళ క్రూరత్వం.. చిన్నారిని అమానుషంగా..: స్పందించిన లతా రజనీకాంత్
x
Highlights

ఓ మహిళ క్రూరత్వం ఇప్పుడు నేట్టింట్లో చర్చనీయాంశం అయింది. ఒక వీడియోలో ఒక మహిళ తన చిన్ని బిడ్డను కర్కశంగా కొడుతోంది. అంతేకాకుండా, కాలితో తొక్కి...

ఓ మహిళ క్రూరత్వం ఇప్పుడు నేట్టింట్లో చర్చనీయాంశం అయింది. ఒక వీడియోలో ఒక మహిళ తన చిన్ని బిడ్డను కర్కశంగా కొడుతోంది. అంతేకాకుండా, కాలితో తొక్కి తన్నుతోంది. ఆ వీడియో నెట్లో చూసిన రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ స్పందించారు. ఆ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానితో పాటు.. అందులో తీవ్ర చిత్ర హింసలను అనుభవిస్తున్న బాలిక ఎవరో ఎవరికైనా తెలిస్తే, తమకు తెలియజేయాలంటూ, ఓ ఫోన్ నంబర్ ను కూడా ఇచ్చారు.

అంతేకాకుండా, సదరు బాలిక ఎవరో తెలిస్తే, వెంటనే చెప్పాలని, బాలికకు రక్షణ కల్పించేందుకు సిద్ధమని లతా రజనీకాంత్ తెలియజేశారు.

లతా రజనీకాంత్ అనాధ బాలల కోసం 'దయా ఫౌండేషన్'ను నిర్వహిస్తూ, వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అంత క్రూరంగా బిడ్డని హింసిస్తున్న మహిళ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories