కొరటాల గ్రేట్: నీతులు చెప్పడమే కాదు పాటిస్తున్నాడు కూడా...

కొరటాల గ్రేట్: నీతులు చెప్పడమే కాదు పాటిస్తున్నాడు కూడా...
x
Highlights

కమర్షల్ ఎలిమెంట్ సినిమాలకి మంచి మెసేజ్ అడ్ చేసి సినిమాలు చేయడంలో కొరటాల స్టయిలే వేరు.. మొదటిసినిమా నుండి అదే ఫాలో అవుతూ ప్లాప్ అంటే చూడని రెండో...

కమర్షల్ ఎలిమెంట్ సినిమాలకి మంచి మెసేజ్ అడ్ చేసి సినిమాలు చేయడంలో కొరటాల స్టయిలే వేరు.. మొదటిసినిమా నుండి అదే ఫాలో అవుతూ ప్లాప్ అంటే చూడని రెండో తెలుగు దర్శకుడిగా ఎదుగుతున్నాడు కొరటాల.. తన మొదటి సినిమా మిర్చిలో వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేది ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారంటూ సీమలో ఫ్యాక్షన్ గోడవలకి శుభం కార్డు వేయాలని గొప్ప నీతని చెప్పాడు కొరటాల..

ఇక ఆ తరవాత శ్రీమంతుడు సినిమాలో వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ తో వచ్చి వావ్ అనిపించాడు.. ఈ కాన్సెప్ట్ చాలా మందికి నచ్చి కొంతమంది కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు.. అప్పడు ఆ సినిమా అంతా ఇంపాక్ట్ ని ఇచ్చింది మరి. ఇక ఆ తరవాత జూనియర్ ఎన్టీఆర్ తో పర్యావరణం పై మనకి కొంచం అయినా భాధ్యత ఉండాలని జనతా గ్యారేజ్ సినిమాలో చెప్పుకొచ్చాడు కొరటాల..

ఇక మహేష్ తో చేసిన భరత్ అను నేను సినిమాలో ఓ బాధ్యత గల ముఖ్యమంత్రి రాష్ట్రంపై ఎలాంటి చర్యలు తీసుకొని ముందుకు నడపలనే మంచి మెసేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరినీ కదిలించాడు కొరటాల... తాను ఇలా నీతులు చెప్పడమే కాదు పక్కాగా పాటిస్తున్నాడు కొరటాల ...

తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు కొరటాల .. హైదరబాద్‌లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఆ వర్షపు నీటిని వడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ దర్శకుడు. తన ఆఫీస్‌లో ఏర్పాటు చేసి ఇంకుడు గుంతల వీడియోను ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు కొరటాల.. మా ఆఫీస్‌లో వాన నీటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతీ నీటి చుక్కను ఇంకుడు గుంతలో భద్రపరుస్తున్నాం..అంటూ పోస్ట్ చేశాడు కొరటాల... కొరటాల చేసిన ఈ పోస్ట్ కి అభిమానులు నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు గ్రేట్ సార్ అనే కామెంట్స్ వస్తున్నాయి..Show Full Article
Print Article
More On
Next Story
More Stories