కోహ్లీని ధోనీని తినేస్తారా?

కోహ్లీని ధోనీని తినేస్తారా?
x
Highlights

ఈ ఫోటోలో పిల్లాడేమిటి కోహ్లీ ని తినేసేలా చూస్తున్నాడు? అనుకుంటున్నారా.. తినేసాలా కాదు ఎలా తినేయాలా అని చూస్తున్నాడు. నిజం. ఎందుకంటే, ఈ కోహ్లీ, ధోనీల...

ఈ ఫోటోలో పిల్లాడేమిటి కోహ్లీ ని తినేసేలా చూస్తున్నాడు? అనుకుంటున్నారా.. తినేసాలా కాదు ఎలా తినేయాలా అని చూస్తున్నాడు. నిజం. ఎందుకంటే, ఈ కోహ్లీ, ధోనీల బొమ్మలు పూర్తి స్వీటు తో తయారు చేశారు. మొన్న కోహ్లీ ధోనీని మా స్వీటెస్ట్ కెప్టెన్ అని కితాబిచ్చాడు కదా. అది నిజం చేయాలనుకున్నారు ఓ స్వీట్ షాపు వాళ్లు. ఇలా కోహ్లీ, ధోనీలను స్వీటులుగా చేసి నిలబెట్టారు. ఇది వెస్ట్ బెంగాల్ లో జరిగింది. వెస్ట్ బెంగాల్ స్వీట్స్ కి పెట్టింది పేరు. అలాగే క్రికెట్ అంటే కూడా ప్రాణం పెట్టేస్తారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం వరల్డ్ కప్ టోర్నీ నడుస్తోంది. దాంతో ఆ రాష్ట్రం లోని హావ్‌డా పట్టణంలో ఓ స్వీట్ షాప్ వ్యాపారికి ఈ ఐడియా వచ్చింది. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీల నిలువెత్తు శిల్పాలను ఇలా మిఠాయితో రూపొందించారు. ఇక దుకాణంలో స్వీట్లు అన్నీ భారత్ జెండాల రంగుల్లో ఉండేలా చేశారు. ఇంకేముంది ఈ దుకాణం ముందు జనాలు క్యూలు కడుతున్నారు. అయిడియా అదిరింది కదూ!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories