Kitchen tips: వంటగ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడానికి ఈ సింపుల్ ట్రిక్ వాడండి!

Kitchen tips: వంటగ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవడానికి తడి గుడ్డ చిట్కా
x

Kitchen tips

Highlights

Kitchen tips: వంటగ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవడానికి తడి గుడ్డ చిట్కా. ఈ సింపుల్ ట్రిక్ తో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ముందే అంచనా వేయవచ్చు.

Kitchen tips: ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్ పై వంట చేస్తున్నారు. గ్యాస్ స్టవ్ లేని ఇల్లు దాదాపుగా లేదని చెప్పవచ్చు. పల్లెల్లో కూడా వివిధ మార్గాల ద్వారా వంట చేసుకుంటున్నా.. ఇంట్లో వంట గ్యాస్ తప్పనిసరిగా ఉండడం కనిపిస్తుంది. అయితే, గ్యాస్ సిలెండర్ వాడుతున్నపుడు అది ఎప్పుడు అయిపోతుంది అనే టెన్షన్ మహిళలకు సహజం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో వంట కోసం గ్యాస్ స్టవ్ పై ఆధారపడి గృహాణిలకు గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో అనే ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. చాలామంది గ్యాస్ తమ అవసరాలను బట్టి సిలెండర్ నెల రోజులు రావచ్చు.. లేదా 25 రోజులు రావచ్చు వంటి లెక్కలు వేసుకుంటారు. దానికోసం సిలెండర్ పై దానిని వాడడం మొదలు పెట్టిన తేదీని వేస్తుంటారు.

Kitchen tips: ఎంత జాగ్రత్తగా లెక్కలు వేసినప్పటికీ వంట మధ్యలో సిలెండర్ అయిపోయి పని పాడయ్యే సందర్భాలు వస్తూనే ఉంటాయి. తేదీల లెక్కలు తప్పుగా ఉండడం.. అనుకున్నదానికంటే ఎక్కువగా గ్యాస్ వాడడం ఇలా ఎన్నో ఈ సడన్ గా వచ్చే ఇబ్బందులకు కారణాలుగా చెప్పవచ్చు.

అత్యవసరంగా వంట చేసేటప్పుడు వారి LPG గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయినప్పుడు చాలా మంది ఇబ్బందుల్లో పడతారు. అటువంటి పరిస్థితిలో, కొన్ని సాధారణ ఉపాయాలను అనుసరించడం ద్వారా, సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో నిమిషాల్లో మీరు తెలుసుకోవచ్చు.

సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో ఎలా తెలుసుకోవాలి?

Kitchen tips: మీ గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవడానికి మీరు ఒక సాధారణ ట్రిక్‌ని ఉపయోగించవచ్చు. ఈ ట్రిక్‌ salve_6717 అనే ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో కనిపించింది. ఆ వీడియో ప్రకారం సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో తెలుసుకోవడానికి ఒక కాటన్ గుడ్డను నీటిలో నానబెట్టి, సిలిండర్ చుట్టూ తుడవండి లేదా కాసేపు కప్పి ఉంచండి. రెండు నిమిషాల తర్వాత ఆ గుడ్డను తీసివేసి గమనించండి. సిలిండర్ పైభాగం త్వరగా ఆరిపోతుంది, కానీ గ్యాస్ ఉన్న భాగం మాత్రం కాసేపటి వరకు తడిగానే ఉంటుంది.

అలా ఎలా?

Kitchen tips: వంట గ్యాస్ (LPG) చల్లగా ఉంటుంది. సిలెండర్ గోడలు దళసరిగా ఉండడం వలన ఆ చల్లదనం మామూలుగా మనం గమనించలేం. అయితే, ఇలా తడి బట్ట కప్పినపుడు సిలెండర్ గోడలపై వేసిన బట్ట ఆరిపోతుంది. కానీ, గ్యాస్ ఉన్న ప్రాంతంలో లోపలి గ్యాస్ చల్లదనం వలన ఆ తేమ సిలెండర్ గోడలపై ఉంటుంది. అందువల్ల గ్యాస్ ఉన్న ప్రాంతంలో చల్లగా ఉంటుంది.

సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవడానికి ఇతర మార్గాలు :

నీటితో పరీక్షించే విధానం:

మరో పద్ధతిలో, ఒక గ్లాసు నీటిని తీసుకుని సిలిండర్ పైనుంచి కిందికి పోయాలి. ఆ తర్వాత మీ చేతితో సిలిండర్‌ను తాకి చూడండి. ఖాళీగా ఉన్న భాగం వేడిగా లేదా సాధారణ ఉష్ణోగ్రతతో ఉంటుంది. గ్యాస్ ఉన్న భాగం మాత్రం చల్లగా తగులుతుంది. ఈ చిన్న ట్రిక్ ద్వారా గ్యాస్ అయిపోవడానికి ఎన్ని రోజుల ముందుగానే అప్రమత్తం కావచ్చో తెలుస్తుంది.

బరువును బట్టి లెక్కించడం:

మరింత ఖచ్చితత్వం కావాలనుకునే వారు సిలిండర్‌ను తూకం వేయవచ్చు. ప్రతి సిలిండర్ పైన దాని ఖాళీ బరువు (Tare Weight) రాసి ఉంటుంది. ఉదాహరణకు, సిలిండర్ మొత్తం బరువు నుంచి ఖాళీ బరువును తీసివేస్తే లోపల ఎంత గ్యాస్ ఉందో తెలిసిపోతుంది. అయితే, తడి గుడ్డ పద్ధతి అన్నిటికంటే సులభమైనదిగా నెటిజన్లు భావిస్తున్నారు. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వంట మధ్యలో గ్యాస్ అయిపోయే టెన్షన్ నుంచి గృహిణులు ఉపశమనం పొందవచ్చు.

సిలెండర్ లో గ్యాస్ ఎంత ఉంది అని తెలుసుకునే విధానంపై ఇన్‌స్టాగ్రామ్ లో ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి:

Show Full Article
Print Article
Next Story
More Stories