ముప్పు తెస్తున్న జెల్లీ ఫిష్

ముప్పు తెస్తున్న జెల్లీ ఫిష్
x
Highlights

జెల్లీ ఫిష్ చూడటానికి బాగానే కనిపిస్తుంది. కానీ, అది పెట్టె ఇబ్బందులు చాలా ఎక్కువ. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జెల్లీ ఫిష్ సంఖ్యా విపరీతంగా...

జెల్లీ ఫిష్ చూడటానికి బాగానే కనిపిస్తుంది. కానీ, అది పెట్టె ఇబ్బందులు చాలా ఎక్కువ. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జెల్లీ ఫిష్ సంఖ్యా విపరీతంగా పెరిగిపోతోంది. సముద్ర కెరటాలతో ఇవి ఒడ్డుకు కొట్టుకు వచ్చేస్తున్నాయి. ఇక అక్కడ ఉండిపోతున్న ఈ ఫిష్ ల కారణంగా సాగర తీర సౌందర్యాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులు అనారోగ్యాల పాలవుతున్నారు. తాజాగా ఇజ్రాయిల్‌లోని సముద్ర తీరానికి కొన్ని లక్షల జెల్లీఫిష్‌లు కొట్టుకుని వచ్చాయి. వీటి కారణంగా పర్యాటకులకు ముప్పు ఏర్పడనుంది. ఈ నేపధ్యంలో పర్యాటకులకు, మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఈ సమస్య కేవలం ఇజ్రాయిల్ సముద్ర తీరానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ కారణంగా ప్రతీయేటా సుమారు 15 కోట్ల మంది పర్యాటకులు అనారోగ్యం పాలవుతున్నారని తెలుస్తోంది. జీవశాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జెల్లీ‌ఫిష్‌ 50 కోట్ల సంవత్సరాల పురాతన జీవి. ఇది సముద్రాలు, నదులలో కనిపిస్తుంటుంది. ఈ జెల్లీఫిష్‌లు కాటు వేయడం కారణంగా ప్రతీయేటా ప్రపంచవ్యాప్తంగా 100 నుంచి 150 మంది మృత్యువాత పడుతున్నారు. మత్స్యకారులకు జల్లీఫిష్ ప్రమాదకారిగా మారింది. ఆస్ట్రేలియాలో 2018-19లో వేసవిలో జెల్లీ ఫిష్‌ల తాకిడి కారణంగా 18 సముద్ర తీరాలను మూసివేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories