Japan Coffin Trend : జపాన్‌లో వింత ట్రెండ్.. బతికుండగానే శవపేటికల్లోకి జనాలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Japan Coffin Trend : జపాన్‌లో వింత ట్రెండ్.. బతికుండగానే శవపేటికల్లోకి జనాలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
x
Highlights

జపాన్‌లో వింత ట్రెండ్.. బతికుండగానే శవపేటికల్లోకి జనాలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Japan Coffin Trend : సాధారణంగా శవపేటిక (కాఫిన్ బాక్స్) అనగానే మనకు మరణం గుర్తుకొస్తుంది. చనిపోయిన వారిని అందులో ఉంచి ఖననం చేయడం ఆనవాయితీ. కానీ జపాన్‌లో ఇప్పుడు ఒక వింత ధోరణి నడుస్తోంది. బతికున్న వాళ్లే స్వచ్ఛందంగా శవపేటికల్లో దూరి పడుకుంటున్నారు. ఇది వినడానికి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా, జపాన్‌లోని చిబా ప్రాంతంలో ఒక ఫ్యూనరల్ హోమ్ ప్రారంభించిన ఈ వింత అలవాటు ఇప్పుడు అక్కడ ఒక ట్రెండ్‎గా మారిపోయింది. మానసిక ప్రశాంతత కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి జపాన్ ప్రజలు ఈ శవపేటిక ధ్యానాన్ని ఎంచుకుంటున్నారు.

జపాన్‌లోని యువతలో ఆత్మహత్యల రేటు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో, మరణం పట్ల భయాన్ని పోగొట్టడానికి, జీవితం ఎంత విలువైనదో తెలియజేయడానికి ఇలాంటి వినూత్న మార్గాలను అక్కడ వ్యాపారవేత్తలు ఎంచుకుంటున్నారు. శవపేటిక లోపల పడుకోవడం వల్ల మనిషికి తన మరణం గురించి ఆలోచించే అవకాశం దొరుకుతుందని, ఇది ఒక సురక్షితమైన కానీ కొంచెం ఊపిరాడని ప్రదేశం కావడంతో బయటకు రాగానే జీవితంపై కొత్త ఆశ చిగురిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒంటరిగా గడపాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అనుభవమని వారు పేర్కొంటున్నారు.

ఈ ట్రెండ్ ఎంతగా పాకిందంటే.. ఇప్పుడు మార్కెట్లో డిజైనర్ శవపేటికలు కూడా అందుబాటులోకి వచ్చాయి. టోక్యోలోని మీసో కుకాన్ కానోకె-ఇన్ వంటి స్పా సెంటర్లలో రంగురంగుల పూలతో అలంకరించిన అందమైన శవపేటికలు దర్శనమిస్తున్నాయి. గ్రేవ్ టోక్యో అనే కంపెనీ వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేస్తోంది. సాధారణ చెక్క పెట్టెలు నచ్చని వారు, ఇలాంటి స్టైలిష్ కాఫిన్ బాక్స్‌లను ఎంచుకోవచ్చు. మరణం అంటే భయంకరమైనది కాదు, అది కూడా ప్రశాంతమైనదే అని ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే తమ ఉద్దేశమని ఈ డిజైనర్లు చెబుతున్నారు.

ఈ కాఫిన్ ఎక్స్‌పీరియన్స్ కోసం సుమారు 30 నిమిషాల సెషన్‌కు 13 డాలర్లు (దాదాపు వెయ్యి రూపాయలకు పైగా) వసూలు చేస్తున్నారు. వినియోగదారులు తమకు నచ్చినట్లుగా శవపేటిక మూత తెరిచి ఉంచవచ్చు లేదా పూర్తిగా మూసివేసి లోపల ప్రశాంతంగా పడుకోవచ్చు. లోపల మ్యూజిక్ వినడం, వీడియోలు చూడటం లేదా పూర్తి నిశ్శబ్దంలో గడపడం వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రముఖ డిజైనర్ మికాకో ఫ్యూజ్ మాట్లాడుతూ.. "తిరిగి రాలేని మరణాన్ని ఎంచుకునే ముందు, తిరిగి రాగలిగే మరణాన్ని (శవపేటిక అనుభవం) రుచి చూడండి" అని పిలుపునిస్తున్నారు. దీనివల్ల చాలా మందిలో ఆత్మహత్య ఆలోచనలు తగ్గుతున్నాయని వారు బలంగా విశ్వసిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories